Extramarital Affair: మనిషిలో ఆటవిక సంస్కృతి పెరిగిపోతోది. మనిషిలోని మంచితనం మాయమవుతోంది. జంతు భావం ఎక్కువవుతోంది. ఫలితంగా మనిషిని మనిషి చంపుకోవడం సాధారణంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చోటుచేసుకున్న సంఘటనలు చూస్తే నిజమే అనిపిస్తోంది. రెండు ఘటనల్లో కూడా ఇద్దరిని దారుణంగా హత్య చేసిన ఉదంతాలు మనకు కనిపిస్తున్నాయి.

అనంతపురం జిల్లా మడకశిర మండలం ఎర్రబొమ్మనపల్లికి చెందిన రంగనాథ్ కు పెళ్లైంది. భార్య మరిదితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో జీర్ణించుకోలేకపోయిన రంగనాథ్ భార్యను హతమార్చాడు. మళ్లీ ఏడేళ్లకు వివాహం చేసుకున్నాడు. కానీ ఈసారి కూడా సీన్ రిపీట్ అయింది. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. కానీ ఇప్పుడు భార్యను కాకుండా తమ్ముడిని హత్య చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా తమ్ముడు అనంతరాజును అంతమొందించేందుకు అతడు ఉండే గార్లదిన్నె మండలం కల్లూరులో ఉంటున్న తమ్ముడి వద్దకు వెళ్లి రాత్రిపూట నిద్రిస్తున్న తమ్ముడిని రాడ్డుతో కొట్టి హత్య చేశాడు. అనంతరం శవాన్ని రామదాసుపేటలోని రైల్వేట్రాక్ పై పడేసి ఆత్మహత్య గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. హతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగనాథ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.
Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరోలు, ప్రముఖులు ఏమన్నారంటే?
మరో ఘటనలో కర్నూలు జిల్లా ఆవుకు ఎస్సై ఫక్రుద్దీన్ ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకుని అందులో ఒకరిని అంతమొందించేందుకు ప్లాన్ చేశాడు. భర్త చనిపోయి ముగ్గురు పిల్లలతో ఉంటున్న సుమలతపై కన్నేసిన ఫక్రుద్దీన్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి వ్యవహారంలో మరో వ్యక్తి తలదూర్చినట్లు అనుమానించాడు. సుమలతకు సుజాత అనే ఆవిడతో స్నేహం ఉంది. దీంతో సుజాతకు సుమలత రూ. ఆరు లక్షలు అప్పుగా ఇచ్చింది. తన అప్పు తిరిగి ఇవ్వమని గొడవ చేస్తుండేది. దీంతో సుజాతతో కూడా అఫైర్ పెట్టుకున్న ఫక్రుద్దీన్ సుమలతను హత్య చేయించాలని పథకం పన్నాడు. దీనికి సుజాతకు దిశానిర్దేశం చేశాడు.

ఎలా చంపాలో ఎలా తప్పించుకోవాలనే దానిపై సుజాతకు సలహా ఇచ్చాడు. దీంతో సుమలతను హత్య చేసేందుకు సుజాతకు రామకృష్ణ, వసంత అనే ఇద్దరు సహకరించారు. చివరకు ఆరా తీస్తే ఫక్రుద్దీన్ పాత్రపై ఆధారాలు లభించాయి. చివరకు అతడు కూడా కటకటాల పాలు కావడం తెలిసిందే. ఇలా మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా చేస్తున్న వ్యవహారాలపై అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. మనుషుల ప్రాణాలంటే విలువ లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Chandrababu Naidu: బాబుకు కొత్త తలనొప్పి..: అభ్యర్థుల మార్పు అసలుకే మోసం..?