Highest Grossing Telugu Films In USA: తెలుగు సినిమాలకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్‌లో మన తెలుగు సినిమాలకు పెద్ద మార్కెట్ ఏర్పడింది. స్టార్ హీరోల సినిమాలు ఇప్పటి వరకు ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా ఎంత వసూలు చేశాయో, ఏ మూవీ టాప్ ప్లేస్ లో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో టాప్ ప్లేస్‌లో ఈ రోజు విడుదలైన RRR మూవీ యూఎస్‌లో దుమ్ము లేపింది. యూఎస్ ప్రీమియర్స్ ద్వారా 3 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది ఈ మూవీ. ఇదే ఇప్పటి వరకు ఎక్కువ కలెక్ట్ చేసింది. రెండో స్థానంలో ఇదే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 నిలిచింది. ఈ మూవీ రూ.352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి, ప్రీమియర్స్ ద్వారా 2 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది.

మూడో స్థానంలో అజ్ఞాతవాసి నిలిచింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా రూ.124.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ప్రీమియర్స్ తో 1.51 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. నాలుగో స్థానంలో బాహుబలి-1 నిలిచింది. రూ.118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ప్రీమియర్స్ ద్వారా 1.36 మిలియన్ డాలర్లు రాబట్టింది.

ఐదో ప్లేస్‌లో మెగాస్టార్ మూవీ ఖైదీ నంబర్ ఉంది. ఈమూవీ ప్రీమియర్స్ ద్వారా 1.29 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఇక దీని తర్వాత స్పైడర్ మూవీ నిలిచింది. ఈ సినిమా రూ.124.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ప్రీమియర్స్ ద్వారా 1 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. వీటి తర్వాత ప్రభాష్ నటించిన రాధేశ్యామ్ ఉంది. ఈ మూవీ 904 K డాలర్లు రాబట్టింది.
ఆ తర్వాత స్థానంలో భరత్ అను నేను సినిమా ఉంది. రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. 850 K డాలర్లు ప్రీమియర్స్ ద్వారా రాబట్టింది. ఇక తొమ్మిదో స్థానంలో ప్రభాస్ మూవీ సాహో నిలిచింది. రూ.270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. ప్రీమియర్స్ ద్వారా 850 K డాలర్లు కొల్లగొట్టింది. పదో స్థానంలో సైరా నరసింహా రెడ్డి నిలిచింది. రూ.187.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. ప్రీమియర్స్ ద్వారా 815K మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

పదకొండో స్థానంలో బన్నీ నటించిన అల వైకుంఠపురములో ఉంది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వచ్చిన మూవీ.. రూ.84.34 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. 809 K డాలర్లు రాబట్టింది. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత మూవీ 12వ స్థానంలో ఉంది. రూ.91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. ప్రీమియర్స్ నుంచే 797 K డాలర్లు కొల్లగొట్టింది. మహేశ్ నటించిన సరిలేరు నీకెవ్వరు 13వ స్థానంలో ఉంది.

రూ.99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. యూఎస్ ప్రీమియర్స్ ద్వారానే 763 K డాలర్లు వసూలు చేసింది. పవన్ నటించిన భీమ్లా నాయక్ 14వ స్థానంలో ఉంది. రూ.106.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. 750 K డాలర్లు ప్రీమియర్స్ నుంచి వసూలు చేసింది.
Also Read: మహేష్ తో రాజమౌళి మూవీ కథ అలా ఉంటుందట.. ఓపెన్ అయిన విజయేంద్రప్రసాద్
Recommended Video: