Homeజాతీయ వార్తలుT-Works: టీ హబ్ తరహాలో టీ వర్క్స్: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలనం

T-Works: టీ హబ్ తరహాలో టీ వర్క్స్: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలనం

T-Works
T-Works

T-Works: ఒక ఆవిష్కరణ కొత్తదారి చూపిస్తుంది. ఒక ఆలోచన వెయ్యి మెదళ్లకు ప్రేరణ కలిగిస్తుంది.. కానీ ఇవన్నీ వెలుగులోకి రావాలంటే ఒక వేదిక కావాలి. పెట్టు బడిపెట్టే సంస్థ కావాలి. ఇలాంటి
ఆలోచనలు, ఆవిష్కరణలు ఏవైనా.. నమూనా (ప్రోటోటైప్‌) యంత్రాన్ని తయారు చేయాలనుకుంటే విద్యార్థుల నుంచి స్టార్ట్‌పలు, పరిశోధకులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారవేత్తలు, బడా పరిశ్రమల వరకు.. టి-వర్క్స్‌ వేదికగా నిలవనుంది. దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్‌ కేంద్రమైన టి-వర్క్స్‌ను గురువారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

ఆలోచనలకు కార్యరూపం..

వస్తువు తయారీకి సంబంధించి ఆలోచనలు ఎన్ని ఉన్నా.. నమూనా యంత్రాన్ని తయారుచేయడం కీలకం. వస్తువు ప్రాథమిక పరిశోధన ఇక్కడినుంచే ప్రారంభమవుతుంది. దీనికి కావాల్సిన అన్ని రకాల వసతులు, సౌకర్యాలతో ఏర్పాటు చేసిందే టి-వర్క్స్‌. ఆలోచన ఉంటే చాలు.. ప్రోటోటైప్‌ యంత్రాన్ని ఇక్కడ రూపొందించవచ్చు. ప్రతి ఒక్కరి అవసరాలకు సరిపడే ప్రోటోటైప్‌ యంత్రాలు తయారు చేసే వ్యవస్థ ఇక్కడ అందుబాటులో ఉంది. తయారీ రంగంలో విశేష నైపుణ్యం ఉన్న 60 మంది నిపుణులు ఉన్నారు.

ప్రారంభానికి ముందే కీలక ఆవిష్కరణలు

ఈ కేంద్రం గురువారం అధికారంగా ప్రారంభం అవుతుండగా.. గత ఏడాది నుంచే అనేక వినూత్న ఆవిష్కర్తలకు అండగా నిలిచింది. మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలు సరఫరా చేసే ప్రాజెక్టును ఓ స్టార్ట్‌పతో కలిసి ప్రభుత్వం గత ఏడాది ప్రారంభించగా.. డ్రోన్‌ డిజైన్‌ తయారీ టి-వర్క్స్‌లోనే మొదలైంది. అలాగే ప్రైవేటు రంగంలో మొట్టమొదటి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన టి-హబ్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ తన ప్రోటోటైప్‌ రాకెట్‌ డిజైన్‌ను టి-వర్క్స్‌లోనే సిద్ధం చేసింది. మాదాపూర్‌లోని టి-హబ్‌ పక్కన 5 ఎకరాల్లో ప్రోటోటైప్‌ కేంద్రాన్ని నిర్మించాలని ఐదేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. 78 వేల చదరపు అడుగుల్లో మొదటి విడత భవనం ఇప్పుడు సిద్ధమైంది. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బృందం ఇటీవలే టి-వర్క్స్‌ను సందర్శించింది. అలాగే ఇతర రాష్ట్రాలు, విదేశీ ప్రతినిధులు కూడా సందర్శించి ఆవిష్కర్తల కోసం ఇక్కడ అంతర్జాతీయస్థాయిలో ఏర్పాటు చేసిన వసతులను ప్రశంసించారు.

T-Works
T-Works

టి-వర్క్స్‌లో లభించనున్న సేవలు..

ఎఫ్‌ఎఎస్ఎఫ్‌ 3డి ప్రింటింగ్‌, ఎస్‌ఎల్‌ఏ 3డి ప్రింటింగ్‌, లేజర్‌ కటింగ్‌, ఎంగ్రేవింగ్‌; సీఎన్‌సీ పైప్‌ బెండింగ్‌; మెటల్‌ ఫ్యాబ్రికేషన్‌, వెల్డింగ్‌; సీఎన్‌సీ మిల్లింగ్‌, టర్నింగ్‌, రూటింగ్‌; ఎన్విరాన్‌మెంట్‌ స్ట్రెస్‌ టెస్టింగ్‌; పీసీబీ లేఔట్‌ డిజైన్‌; ఎలకా్ట్రనిక్‌ టెస్టింగ్‌; థర్మల్‌ ఇమేజింగ్‌. వంటి వాటిని ఇందులో అందుబాటులో ఉంచారు.. ఇప్పటికే టీ హబ్ ఐటి రంగంలో గేమ్ చేంజర్ గా నిల్వగా.. ఇప్పుడు టీ వర్క్స్ కూడా మరో కలికి తురాయి గా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version