Shyam Singha Roy: ‘శ్యామ్ ​సింగరాయ్’​ సినిమాతో ఆ ధైర్యం వచ్చిందంటున్న హీరో నాని!

Shyam Singha Roy: నేచురల్​​ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా శ్యామ్ సింగరాయ్​. ఇందులో సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్​ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​.. భారీ అంచనాలను క్రియేట్​ చేసింది. కలకత్తాలో బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. ఈ నెల24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో వేగవంతం చేశారు మేకర్స్​.  నిహారిక […]

Written By: Raghava Rao Gara, Updated On : December 19, 2021 11:08 am
Follow us on

Shyam Singha Roy: నేచురల్​​ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా శ్యామ్ సింగరాయ్​. ఇందులో సాయిపల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్​ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్​.. భారీ అంచనాలను క్రియేట్​ చేసింది. కలకత్తాలో బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా.. ఈ నెల24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​లో వేగవంతం చేశారు మేకర్స్​.  నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్తున్న ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. సాయిపల్లవి దేవదాసిగా కనువిందు చేయనుంది.

కాగా, తాజాగా హైదరాబాద్​ శిల్పకళా వేదికపై శ్యామ్​ సింగరాయ్ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ జరిగింది. ఈ వేడుకలో నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని మాట్లాడుతూ.. బ్లెజర్ బావుంది కగా.. ఏ ఈవెంట్​కు వచ్చినా ఫార్మల్స్​లోనే వస్తుంటాడని ఫాలోవర్స్ అంటుంటే.. మా ఆవిడ ఓ పది బ్లేజర్స్​ కొని పడేసింది. అప్పుడప్పుడు వేసుకోమని మా ఆవిడ చెప్తే.. అసలు నేను సూట్లేసుకుని తిరగడానికి ఏం పీకామని.. వద్దులే అని లోపలే పెట్టేశాను.. ఇప్పుడు అవన్నీ దుమ్ము కూడా పట్టాయి. అయితే, శ్యామ్ సింగరాయ్​ సినిమా చూసిన తర్వాత బ్లేజర్ వేసుకోవాలనిపించింది. అందుకే ఇప్పుడు వేసుకుని ధైర్యంగా మీ ముందుకు వచ్చా.. ఇంతకు మించి ఈ సినిమా గురించి మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. అని సరికొత్త స్పీచ్​ తో అందర్నీ ఆకట్టుకున్నాడు.

ఈ సినిమా చేస్తున్నంత సేపు మా టీమ్​లోని అందరూ వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారని అన్నారు నాని.  మేము సినిమా తీస్తున్నంత సేపు ఎంత సంతృప్తి చెందామో.. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు అంతే సంతృప్తి కనిపిస్తుందని అన్నారు.