KTR: తెలంగాణలో రాజకీయ పార్టీల వైఖరులు మారుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో తీరుగా స్పందిస్తోంది. ఇప్పటికే బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నా వాటిని అధికార పార్టీ లెక్కలోకి తీసుకోవడం లేదు. కానీ అలవాటులో పొరపాటుగా ఏదో యాదృచ్చికమో వ్యూహాత్మకమో గానీ తెలంగాణ మంత్రి కేటీఆర్ వారిని ఉద్దేశించి విమర్శలు చేయడంతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

ఇన్నాళ్లు షర్మిలను ఏ రాజకీయ పార్టీ కూడా గుర్తించలేదు. అసలు ఆమెను నాయకురాలిగా కూడా ఎవరు అంగీకరించలేదు. పాదయాత్ర చేసినా ఆమెను పటించుకున్న పాపాన పోలేదు. కానీ కేటీఆర్ మాత్రం షర్మిలకు తెలంగాణలో ఏం పని అని విమర్శలు చేశారు. ఏదైనా ఉంటే వారి సొంత రాష్ట్రంలో తేల్చుకోవాలి కానీ ఇక్కడ ఎందుకు అని వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇన్ని రోజులు ఆమె నాయకత్వాన్ని ఎవరు కూడా లెక్కచేసిన సందర్భాలు లేవు.
Also Read: KCR vs Governor: కేసీఆర్ వర్సెస్ గవర్నర్: అగ్నికి ఆజ్యం పోస్తున్న అసదుద్దీన్?
కానీ ఉన్నపళంగా ఆమెపై ఆరోపణలు చేయడంతో కేటీఆర్ వైఖరి ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అసలు ఆయన పద్ధతి మార్చుకున్నారా? లేక షర్మిలకు ప్రాధాన్యం ఇస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. దీంతోనే పార్టీల్లో నిర్ణయాలు మారుతున్నాయి. ఆలోచనలు కొత్త రూపు దాలుస్తున్నాయి. ఇందుకు తార్కాణమే కేటీఆర్ వ్యాఖ్యలు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్లోంది.

ఈ నేపథ్యంలో అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అన్న మాటలు గుర్తు చేసుకుని రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న సంబంధాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మారుతున్న నిర్ణయాలతో భవిష్యత్ ఏమిటనే స్రశ్నలు కూడా వస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో ఇంకా ఎన్ని చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయో చెప్పలేని పరిస్థితి.
Also Read:RRR OTT: ఓటీటీ రాక పై మరో ట్విస్ట్.. ఎప్పుడు ? ఎక్కడో తెలిస్తే షాకే !
[…] Minister Ajay Kumar: ఖమ్మంలో రాజకీయాలు మారుతున్నాయి. బీజేపీ నాయకుడు సాయిగణేష్ వ్యవహారం అధికార పార్టీకి గుదిబండగా మారుతోంది. టీఆర్ఎస్ భవితవ్యంపై పెను ప్రభావం చూపనుది. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మెడకు ఈ వ్యవహారం చుట్టుకోవడం తెలిసిందే. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో తెలియడం లేదు. అనతికాలంలోనే మంత్రి పదవి దక్కించుకున్న అజయ్ విషయంలో అధిష్టానం కూడా సీరియస్ గానే ఉన్న్టట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మంత్రి అజయ్ పై వేటువేసే ఆలోచనలో కూడా పడినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఖమ్మం రాజకీయాలు ఎటు వైపు తిరుగుతాయో అర్థం కాని పరిస్థితి. […]
[…] CM Kcr: టీఆర్ఎస్ లో మంత్రుల పాత్ర వివాదాస్పదంగా మారుతోంది. ఈటల రాజేందర్ ను తొలగించడంతో చాలా మందిపై ఆరోపణలు వచ్చినా కేసీఆర్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు కానీ వారిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఇటీవల ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై సైతం ఇదే కోవలో ఆరోపణలు వచ్చినా ఆయనపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. గతంలో సైతం ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి పై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా లెక్కలోకి తీసుకోవలేదు. […]