https://oktelugu.com/

Minister KTR: మంత్రి కేటీఆర్ మళ్లీ రైతుల వెంట పడ్డారే? వరాల వానకు కారణమేంటి?

Minister KTR: తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త పల్లవి అందుకుంటోంది. ఇన్నాళ్లు రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా కొత్త రాగం అందుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ నేపథ్యంలో రైతులపై మొసలి కన్నీరు కార్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ రైతుల కోసం ఏదో చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూ వారిని మభ్యపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులకు ఎంత చేసిన తక్కువే అని కొత్త పాట అందుకున్నారు. ఈ […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 8, 2022 / 09:25 AM IST
    Follow us on

    Minister KTR: తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త పల్లవి అందుకుంటోంది. ఇన్నాళ్లు రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా కొత్త రాగం అందుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ నేపథ్యంలో రైతులపై మొసలి కన్నీరు కార్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ రైతుల కోసం ఏదో చేస్తున్నట్లు ప్రకటనలు చేస్తూ వారిని మభ్యపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన రైతులకు ఎంత చేసిన తక్కువే అని కొత్త పాట అందుకున్నారు.

    KTR

    ఈ మేరకు రైతుల త్యాగాలు వెలకట్టలేనివని చెబుతున్నారు. వారికి ఎంత చేసిన తక్కువే అని కితాబిస్తున్నారు. ఏదో ఉడత సాయంగా వారికి వంద గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వడానికి నిర్ణయించారు. భూములిచ్చిన వారందరికి ప్లాట్లు ఇస్తామని హామీ ఇస్తున్నారు.దీంతో కేటీఆర్ వ్యూహంలో వచ్చిన మార్పు ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి భయపడే ఇలా మాట్లాడుతున్నారా అనే వాదనలు కూడా వస్తున్నాయి. కానీ కేటీఆర్ తీసుకున్న నిర్ణయంతో భూములు కోల్పోయిన వారికి న్యాయం జరుగుతున్న ఇందులో ఏదో రాజకీయ కోణం ఉందని తెలుస్తోంది.

    Also Read: Secretariat Employees: ఏపీలో సచివాలయ ఉద్యోగులకు పొమ్మన లేక పొగ

    టీఆర్ఎస్ లో కూడా భయాందోళన మొదలైంది. అటు రాహుల్ పర్యటన ఇటు బండి సంజయ్ పాదయాత్ర నిద్ర లేకుండా చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారానికి దూరమవుతామోననే అనుమానంతోనే ఇవన్నీ చేస్తున్నట్లు సమాారం. లేకపోతే ఇన్నాళ్లు గుర్తుకురాని రైతులు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారు. రైతు పండుగ చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న మంత్రి ఉన్నట్లుండి రైతులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం వెనుక ఏదో రహస్యం దాగి ఉన్నట్లు రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.

    KTR

    ఏది ఏమైనా రైతులకు మాత్రం మేలు జరుగుతుంది. ఏ పార్టీ అయితేనేమీ వారికి లాభం జరిగితే అంతే చాలు. అందుకేు కేటీఆర్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. తొందరగా ప్లాట్లు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యకమంతో అందరికి మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. భూములు కోల్పోయి నైరాశ్యంలో ఉన్న వారికి కేటీఆర్ ప్రకటన నూతనోత్తేజం నింపినట్లు అయింది. అందుకే త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ప్లాట్ల విషయం వెలుగులోకి తెచ్చినట్లు చెబుతున్నారు.

    Also Read:Yadadri- KCR: యాదాద్రి లోపాలు కేసీఆర్ మెడకే చుట్టుకుంటున్నాయా?

    Tags