Homeఆంధ్రప్రదేశ్‌Secretariat Employees: ఏపీలో సచివాలయ ఉద్యోగులకు పొమ్మన లేక పొగ

Secretariat Employees: ఏపీలో సచివాలయ ఉద్యోగులకు పొమ్మన లేక పొగ

Secretariat Employees: ఏపీలో సచివాలయ ఉద్యోగులకు పొమ్మన లేక పొగ పెడుతున్నారు. సీఎం జగన్ మానస పుత్రికగా ప్రారంభించిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులను నియమించి దాదాపు రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ప్రొబేషన్ డిక్లేర్ చేయడం లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2019 అక్టోబరు 2న ఆర్భాటంగా సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. దాదాపు 19 శాఖలకు సంబంధించి సహాయకులను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల మంది ఉద్యోగులను భర్తీ చేశారు. వారికి నెలకు వేతనం రూ.15,000గా నిర్ణయించారు. సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత వారి ప్రొబేషనరీ డిక్లేర్ చేసి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీతాలు, అలవెన్సులు ఉంటాయని నోటిఫికేషన్ లో పేర్కోన్నారు. అయితే రెండు సంవత్సరాల ప్రాబేషనరీ పీరియడ్ గత ఏడాది అక్టోబరుతో పూర్తయినా డిక్లరేషన్ చేయలేదు. డిపార్ట్ మెంట్ పరీక్షలను తెరపైకి తెచ్చారు.

Secretariat Employees
Secretariat Employees

అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే డిక్లరేషన్ చేస్తామని చెప్పుకొచ్చారు. అందులో కొన్ని శాఖల సహాయకులకు తొలుత పరీక్షలు నిర్వహించారు. ఇందులో కొందరు ఉత్తీర్ణత సాధించారు. మరికొందరు అర్హత సాధించలేదు. దీనిపై గందరగోళం స్రుష్టించి ప్రొబేషనరీ పీరియడ్ ను మరో ఆరు నెలలు పొడిగించారు. 2022 జూన్ లో ప్రొబేషనరీ డిక్లేర్ చేస్తామని మాట మార్చారు. తీరా ఇప్పుడు గడువు సమీపిస్తుండడంతో మరోసారి వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు రకరకాల కారణాలను వెతుకుతున్నారు. ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆకస్మికంగా సచివాలయాలను సందర్శిస్తున్నారు. స్పందనలో వచ్చిన వినతికి పరిష్కారం చూపలేదని, విధులకు ఆలస్యంగా వస్తున్నారని, సమయపాలన పాటించడం లేదని, బయోమెట్రిక్ సక్రమంగా వేయడం లేదని.. సెలవులు ఎక్కువ పెడుతున్నారని ఇలా రకరకాల కారణాలు చూపి సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ప్రొబేషనరీ డిక్లరేషన్ ను మరో కొద్ది నెలలు పొడిగించడంలో భాగంగానే ఈ కొత్త ఎత్తుగడని సచివాలయ ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Theatres In Hyderabad: సండే స్పెషల్: థియేటర్స్ కా రాజధాని హైదరాబాద్..

గొడ్డు చాకిరీ..
వారికి ఇస్తున్నదే రూ.15 వేల వేతనం. కానీ గొడ్డుచాకిరీ చేయించుకుంటున్నారు. విధులకు హాజరైన వారి బయోమెట్రిక్ హాజరును రోజుకు మూడు సార్లు వేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విధులు, మండల అధికారుల సమావేశాలు, ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ, ఓటీఎస్ తో పాటు అన్ని రకాల పన్నుల వసూలు ప్రభుత్వ పథకాల ప్రచారం ఇలా అన్ని బాధ్యతలను వారికే అప్పగిస్తున్నారు. ఒక అడుగు ముందుకేసి మరుగుదొడ్ల దగ్గర డబ్బులు వసూలు చేసే పనులు అప్పగించడం అత్యంత దయనీయం. వారు చెప్పిన పనులు చేయకుంటే సస్పెండ్ చేస్తున్నారు. ప్రొబేషనరీ డిక్లేర్ చేసిన నాటికి ఎన్నిరకాల ఒత్తిళ్లుకు గురిచేస్తారో అన్న ఆందోళన వెంటాడుతోంది. ఏ ప్రభుత్వ శాఖలో లేని విధంగా యూనిఫారం సైతం అమలు చేశారు. అది ఎందుకంటే ప్రజలు ఈజీగా గుర్తిస్తారని సాకుగా చూపుతున్నారు. యూనిఫారం వేయకుంటే ఫైన్ వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్టు చందంగా మండల స్థాయి అధికారులు ఒక వైపు.. గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు మరోవైపు ఒత్తడికి గురిచేస్తున్నారు. ఉద్యోగం వచ్చిందని ఎంతో ఆనందించామని.. ఇప్పుడు క్షోభ పెడుతున్నారంటూ సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Secretariat Employees
Secretariat Employees

అడియాశలు..
ఉన్న ఊరిలో ఉద్యోగం కదా అని ఉన్నత కొలువులు వదులుకొని చాలా మంది సచివాలయ ఉద్యోగులుగా చేరారు. లక్షలాది రూపాయల వేతనం వస్తున్నా.. ప్రభుత్వ ఉద్యోగంగా భావించి చాలా మంది విద్యాధికులు సచివాలయ ఉద్యోగులుగా వచ్చారు. ఇంటి వద్ద నుంచి రాకపోకలు సాగించి.. కన్నవారి కళ్లెదుటే ఉద్యోగం చేయవచ్చునని భావించారు. రెండేళ్లు కళ్లు మూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగిగా మారిపోవచ్చని కలలు కన్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి.ప్రభుత్వం పొమ్మన లేక పొగ పెడుతుండడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను భారంగా పరిగణిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. నెలకు రూ.5 వేల కోట్లు అప్పు పుడితే కానీ పూట గడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీ డిక్లేర్ చేస్తే జీతాల రూపంలో అదనపు భారం తప్పదు. అందుకే ప్రభుత్వం డిక్లరేషన్ ను వాయిదా వేస్తూ వస్తోంది. గడువు సమీపిస్తుండడంతో వారు గొడవ చేయకుండా కొరడా ఝుళిపిస్తోంది. అయితే ప్రభుత్వ చర్యలతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సైతం సచివాలయ ఉద్యోగులకు మద్దతు తెలపకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:KTR- Congress Party: కాలం చెల్లిన పార్టీతో పొత్తా? కాంగ్రెస్ కు చురకలంటించిన కేటీఆర్

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version