
రైతులను భూముల సమస్యల నుంచి దూరం చేయాలని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. ఏకంగా వీఆర్వో వ్యవస్థనే రద్దు చేశారు. ఆయన కొడుకు, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు సునాయసనం చేయాలని ప్లాన్ చేశారు.
Also Read: అవినీతి ఏసీపీ.. ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
ప్రభుత్వ సేవలు పొందాలంటే ప్రజలకు ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలు.. ప్రతీ దానికి ఎన్నో సార్లు ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆన్‌లైన్ కాలంలోనూ పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ఈసేవలు అని.. మరొకటని చాలా ప్రయత్నాలు చేస్తున్నా పెద్దగా మార్పు ఉండటం లేదు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో భాగంగా ప్రజలకు అందించే సిటిజన్ చార్టర్‌ను మెరుగు పరిస్తే ఉన్నతమైన సేవలు అందించవచ్చని కేటీఆర్ భావిస్తున్నారు. ప్రత్యేకంగా సిటిజన్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ద్వారా ఇది సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలకు వర్తింపజేయాలని మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే అధికారుల టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ సంస్కరణలతో రాష్ట్ర పౌరులకు అనేక ప్రయోజనాలు కల్పించాలని.. సంస్కరణలతో ఆయా శాఖల పనితీరులో సానుకూల మార్పులు రావాలని నిర్దేశించారు. పౌరులకు అన్ని సేవలను ఒకేచోట అందించేందుకు.. ప్రత్యేకంగా సిటిజన్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్ పోర్టల్‌ను రూపొందించాలని నిర్ణయించారు.
Also Read: వ్యవసాయేతర ఆస్తుల విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..?
ప్రభుత్వం తరఫున ప్రజలకు పకడ్బందీగా సేవలందిస్తే సంతృప్తి పడతారని కేటీఆర్ భావిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా అన్ని వ్యవహారాలను చక్కబెట్టుకునే విధానంతో ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే వారి సంఖ్యను కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్ పక్కాగా ప్రణాళిక రూపొందిస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తెలంగాణ అటు వ్యాపారపరంగా.. ఇటు ప్రజాసేవల పరంగా.. మొదటి స్థానంలో నిలిచే అవకాశాలూ లేకపోలేదు.
Comments are closed.