ఉద్యోగ నియామకాలపై కేటీఆర్ క్లారిటీ

తెలంగాణలో ఉద్యోగ నియామకాల కోసం కండ్లు కాయలు కాసి పండ్లు అయిపోయి పుచ్చిపోయేలా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సాగించే ‘నీళ్లు, నిధులు, నియామకాల’పైన. మొదటి రెండు నెరవేరినా మూడోదాన్ని కేసీఆర్ సర్కార్ గత ఏడేళ్లుగా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తెలంగాణ కోసం ఎంతో కొట్లాడిన నిరుద్యోగుల ఆశలను నెరవేర్చడం లేదు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల సహా కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడు ‘నిరుద్యోగుల’ అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ […]

Written By: NARESH, Updated On : July 2, 2021 6:15 pm
Follow us on

తెలంగాణలో ఉద్యోగ నియామకాల కోసం కండ్లు కాయలు కాసి పండ్లు అయిపోయి పుచ్చిపోయేలా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం సాగించే ‘నీళ్లు, నిధులు, నియామకాల’పైన. మొదటి రెండు నెరవేరినా మూడోదాన్ని కేసీఆర్ సర్కార్ గత ఏడేళ్లుగా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. తెలంగాణ కోసం ఎంతో కొట్లాడిన నిరుద్యోగుల ఆశలను నెరవేర్చడం లేదు.

ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల సహా కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇప్పుడు ‘నిరుద్యోగుల’ అంశాన్ని లేవనెత్తారు. తెలంగాణ నిరుద్యోగుల నుంచి వీరిద్దరికి అపూర్వమైన మద్దతు లభించింది. ఎందుకంటే గడిచిన ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగ ప్రకటన లేక నిరుద్యోగులు అవురావురూ మంటూ ఆశగా ఉన్నారు. ఈక్రమంలోనే ప్రతిపక్షాలు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతు లభిస్తోంది.

అన్ని వైపుల నుంచి ఒత్తిడి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా అప్రమత్తమైంది. జోనల్ వ్యవస్థకు ఆమోద ముద్ర వేయించుకొని ఉద్యోగ ప్రకటనలకు రెడీ అవుతోంది. ఉమ్మడి ఏపీలో అన్యాయంగా ఉన్న జోనల్ వ్యవస్థను రద్దు తెలంగాణ నిరుద్యోగులకే మేలు చేసేలా జోనల్ వ్యవస్థ రూపొందించామని మంత్రి కేటీఆర్ తాజాగా తెలిపారు.

కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు దాదాపు 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 95శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయని కేటీఆర్ పేర్కొన్నారు. జిల్లాలను జోన్లుగా వర్గీకరించడం వల్ల జిల్లా స్థాయి పోస్టులు అయిన జూనియర్ అసిస్టెంట్ మొదలు జోనల్, మల్టీ జోన్ వరకు అన్ని స్థాయిల ఉద్యోగాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు, న్యాయం జరుగుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే తెలంగాణలో 1,33,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు అందించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక ప్రైవేటు పెట్టుబడులతో తెలంగాణలో వేల పరిశ్రమలు వచ్చి 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయని కేటీఆర్ తెలిపారు. స్థానిక యువతకే పెద్దపీట వేసేలా ఉందని వివరించారు.

మొత్తానికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తెలంగాణ ఏర్పడి ఏడేళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలపై ఇప్పటికైనా తెలంగాణ సర్కార్ ముందడుగు వేయడం నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.