Homeజాతీయ వార్తలుKTR - unemployed : కేటీఆర్ సార్... ఇదీ నిరుద్యోగులను మీరు వంచిస్తున్న తీరు

KTR – unemployed : కేటీఆర్ సార్… ఇదీ నిరుద్యోగులను మీరు వంచిస్తున్న తీరు

KTR – unemployed : “ఎవరో ఇద్దరు చేసిన తప్పుకు ప్రభుత్వం ఎలా బాధ్యత తీసుకుంటుంది? దానికి, ప్రభుత్వానికి ఏమి కారణం? అసలు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ రంగ సంస్థ కాదు? ప్రతిపక్షాలు యువతను రెచ్చగొడుతున్నాయి.. వారి ట్రాప్ లో యువత పడకూడదు. యువత మళ్లీ ఫీజు చెల్లించకుండానే పరీక్ష రాసే అవకాశం కల్పిస్తాం. అన్ లైన్ లో గ్రూప్ వన్ మెటీరియల్ అందుబాటులో ఉంచుతాం. 24 గంటల పాటు లైబ్రరీలు నడిచేలా చర్యలు తీసుకుంటాం. యువతకు అక్కడే భోజన సదుపాయం కల్పిస్తాం” ఇదీ కేటీఆర్ ఇటీవలి ప్రెస్ మీట్ సారాంశం. పైగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎదురు ప్రశ్నలు వేసిన విలేకరులపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు..

కానీ ఇక్కడ మంత్రి తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రభుత్వానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ కమిషన్ కు సంబంధం లేనప్పుడు.. కమిషన్ సభ్యులను ప్రభుత్వం ఎందుకు నియమించినట్టు? వారు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందినవారు కాదా? ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు ఐటీ శాఖ మంత్రి ఎందుకు విలేకరుల సమావేశం నిర్వహించినట్టు? పక్కనే విద్యాశాఖ మంత్రి ఉన్నా ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, కేటీఆర్ ఎందుకు మాట్లాడినట్టు? పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న రేణుక భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సర్పంచ్ కూతురు.. ఈ విషయాన్ని దాచిపెట్టి ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ గతంలో భారతీయ జనతా పార్టీలో పని చేశాడు, ఆ పార్టీ ఆదేశాల మేరకే పేపర్ లీకేజీకి పాల్పడ్డాడు అని మంత్రి ఆరోపణలు చేశారు.. మరి ఆ లెక్కన రేణుక తల్లి భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సర్పంచ్ … అయితే ఇందులో భారత రాష్ట్ర సమితి పాత్ర కూడా ఉన్నట్టే కదా! మంత్రి మాట్లాడే విషయాలు ఒకోసారి ఏవగింపు కలిగిస్తున్నాయి. కనీస పరిజ్ఞానం కూడా ఉన్నట్టు కనిపించడం లేదు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగానికి సంబంధించి పరీక్ష ఫీజు చెల్లించినప్పుడు.. అనివార్యంగా ఆ పరీక్ష వాయిదా పడితే లేదా రద్దు అయితే.. మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.. కానీ ఈ విషయం తెలియని మంత్రి అభ్యర్థుల దగ్గర నుంచి పైసా తీసుకోకుండానే మళ్లీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని చెప్పడం హాస్యాస్పదం.

వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన దగ్గర్నుంచి నిరుద్యోగులను భారత రాష్ట్ర సమితి వంచిస్తూనే ఉంది.. నీళ్లు, నిధులు, నియామకాలే ఏజెండాగా ఏర్పడిన రాష్ట్రంలో నిరుద్యోగులకు మొదటి నుంచి మోసమే జరుగుతుంది. ఉద్యోగాల భర్తీపై నాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చెప్పిన ఒక్క మాట కూడా అమలవడం లేదు. రాష్ట్రం వస్తే ఉద్యోగం నోటిఫికేషన్లు వస్తాయని ఆశించి లక్షల మంది యువత ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. 18 నాటికి కనీసం 40 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయారు. దీంతో చాలామంది తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రైవేట్ ఉద్యోగాలలో చేరిపోయారు. 2018 ఎన్నికల ముందు నిరుద్యోగులలో అసహనాన్ని పసిగట్టిన కేసీఆర్ నెలకు 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ దానిని అమలు చేయకుండా మధ్యలోనే వదిలేశారు. 2019లో నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు నాటి ఓటాన్ ఎకౌంటు బడ్జెట్లో కేటాయింపులు జరిపినప్పటికీ ఇప్పటిదాకా ఒక్కరికి కూడా సహాయం చేయలేదు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేసింది. ఖాళీల లెక్కల పేరిట, జోన్ల మార్పుల పేరిట నాలుగేళ్ల పాటు సాగదీస్తూ వచ్చింది. ఎన్నికల ఏడాది రాగానే ఒకేసారి నోటిఫికేషన్లు ఇవ్వడం ప్రారంభించింది. దీంతో లక్షల మంది యువత ఉద్యోగుల ప్రిపరేషన్ లో మునిగిపోయారు. నిరుద్యోగ భృతికి ఎగనాం పెట్టిన సర్కార్.. ప్రిపరేషన్ లో ఉన్న నిరుద్యోగులకు ఉపకార వేతనం ఇస్తామని ప్రకటించింది. గ్రూప్ వన్ అభ్యర్థులకు నెలకు 5000 చొప్పున ఆరు నెలలపాటు, గ్రూప్ 2, ఎస్సై అభ్యర్థులకు నెలకు 2000 చొప్పున 3 నెలల పాటు ఇస్తామని హడావిడి చేసింది. ఈ స్కాలర్షిప్ కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 1.25 లక్షల మందిని ఎంపిక చేసేందుకు పరీక్ష కూడా పెట్టారు. కానీ ఇప్పటిదాకా ఎవరికీ ఉపకార వేతనం ఇవ్వలేదు.

80,039 పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా గత ఏడాది మార్చి 9 న ప్రకటించారు. ఇప్పటివరకు వాటిలో సగం పోస్టుల భర్తీ కూడా కాలేదు. నోటిఫికేషన్లు మాత్రం విడుదలయ్యాయి. 969 పోస్టులు మాత్రమే భర్తీ. మిగతా 80 వేల పోస్టులను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ చేస్తామని అప్పట్లో అధికారులు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2022లో వివిధ శాఖలోని 17 వేల పోస్టుల భర్తీకి 26 నోటిఫికేషన్లు జారీ చేశారు. వీటిలో ఈడు నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు కూడా నిర్వహించారు. ప్రశ్న పత్రం లేక నేపథ్యంలో వాటిలో నాలుగు పరీక్షలు రద్దు చేశారు. గిటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ ఏడాది కిందట ప్రకటించారు. అయితే ఇప్పటికి ఆ ఊసు ఎత్తడం లేదు. టీచర్ పోస్టుల కోసం కూడా బీఈడీ అభ్యర్థులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఇన్ని వైఫల్యాలు కనిపిస్తుంటే మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రభుత్వం దివాళ కోరుతానానికి నిదర్శనమని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version