KTR On Twitter: రాష్ట్ర మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమాలను ఎకకువగా అనుసరిస్తారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమం ద్వారా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. మీకు ఇష్టమైన నాయకుడు ఎవరంటే కేసీఆర్ తరువాత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని బదులిచ్చారు. ఆయన సిద్ధాంతాలు నాకు బాగా ఇష్టం. అందుకే ఆయనను ఎక్కువగా ఇష్టపడుతుంటానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించగా దానికి కూడా జవాబు చెప్పారు.

దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడం తెలిసిందే. తెలంగాణలో మాత్రం బీజేపీతో పాటు టీఆర్ఎస్ పోటీలో ఉంటుంది. కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో సంస్థలను విక్రయించేందుకు చూస్తుందని విమర్శించారు. దాన్ని ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని హితవు పలికారు. మనమంతా కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
Also Read: Ram Gopal Varma- Mother’s Day: నేను ఓ మంచి కొడుకును కాదంటున్న రాంగోపాల్ వర్మ
త్వరలో తెలుగుతో పాటు అన్ని పరీక్షల్లో ఉద్దూకు కూడా స్థానం కల్పిస్తామన్నారు. యూపీఎస్సీ, గ్రూప్స్ పరీక్షల్లో ఇక మీదట ఉర్దూ కూడా ఉంటుందని గుర్తు చేశారు. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఉర్దూ కూడా ఒకటని గుర్తు చేశారు.అందుకే ఉర్దూకు కూడా తగిన విలువ ఇస్తామని పేర్కొన్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ నిదానంగా సమాధానాలు ఇచ్చారు.

తెలుగు సినిమాకు అంతర్జాయ ఖ్యాతి తీసుకురాడానికి ప్రయత్నిస్తున్నాం. దీని కోసం సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నారని గుర్తు చేశారు ఇంకో ప్రశ్నకు సమాధానంగా రాహుల్ గాంధీ అమేథీలో గెలవడానికి పాటుపడాలని సూచించారు. పెట్రో ధరలపై అడిగిన ప్రశ్నకు వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం అందుకుంటామని బదులిస్తూ తన సమాధానం చెప్పారు.
Also Read:Suriya- Director Bala Movie: కృతి శెట్టితో పాటు ఆమె కూడా రెడీ.. జ్యోతిక జోక్యం లేదు !
Recommended Videos: