KTR: తెలంగాణలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరగాల్సి ఉన్నా కలిసి రాకపోవడంతో ప్రతి సారి వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఈనెల 17న విడుదల చేయనున్నారు. ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా, రాష్ర్ట స్థాయి కమిటీలు పూర్తయిన నేపథ్యంలో ఇక రాష్ర్ట కమిటీ ఎన్నిక మిగిలిపోయింది.

నగరంలోని హెచ్ ఐఐసీ ప్రాంగణంలో అక్టోబర్ 25న జనరల్ బాడీ సమావేశం నిర్వహించి అధ్యక్షుడి ఎన్నికుంటామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ నెల 22 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజుగా నిర్ణయించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించనున్నారు.
ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం కేటీఆర్ ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 15న వరంగల్ లో ద్విశతాబ్ధి ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 27న అన్ని నియోజకవర్గాల్లో విజయ గర్జన సభ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. దీంతో ఎన్నికలపై అందరిలో ఆసక్తి నెలకొంది. పార్టీ తీసుకోబోయే నిర్ణయాలపై ఎదురు చూస్తున్నారు.
ఈసారి జరిగే ఎన్నికల్లో కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ కు అధ్యక్ష పదవి అప్పగిస్తారని ప్రచారం సాగినా చివరి క్షణంలో దక్కలేదు. దీంతో ఈ సారి మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ పుంజుకుంటున్న నేపథ్యంలో కేటీఆర్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీని గాడిలో పెట్టే పని కేటీఆర్ కు కట్టబెడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తల్లో అనుమానాలు వస్తున్నాయి.