https://oktelugu.com/

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కేటీఆర్‌‌ దూకుడు

మొన్నటి దుబ్బాక ఫలితాలతో టీఆర్‌‌ఎస్‌ పార్టీ పరువు పోయినట్లైంది. అధికారంలో ఉండి.. అదీ సీఎం సొంత జిల్లాలో ఓటమి పాలు కావడం మరింత అవమానకరంగా అనిపించింది. మరోవైపు ఈ గెలుపు మాత్రం బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బీజేపీ హవా చూసి కాంగ్రెస్‌కు దిమ్మతిరిగింది. ఇదే గెలుపుతో ఇక జీహెచ్‌ఎంసీ పైనా కాషాయం జెండా ఎగురేస్తామని చెబుతోంది కమలదళం. Also Read: రాజకీయం.. రణం.. అమాయకుల ప్రాణాలు ఖతం జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ముహూర్తం షాట్‌ రెడీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 12, 2020 / 03:59 PM IST
    Follow us on

    మొన్నటి దుబ్బాక ఫలితాలతో టీఆర్‌‌ఎస్‌ పార్టీ పరువు పోయినట్లైంది. అధికారంలో ఉండి.. అదీ సీఎం సొంత జిల్లాలో ఓటమి పాలు కావడం మరింత అవమానకరంగా అనిపించింది. మరోవైపు ఈ గెలుపు మాత్రం బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. బీజేపీ హవా చూసి కాంగ్రెస్‌కు దిమ్మతిరిగింది. ఇదే గెలుపుతో ఇక జీహెచ్‌ఎంసీ పైనా కాషాయం జెండా ఎగురేస్తామని చెబుతోంది కమలదళం.

    Also Read: రాజకీయం.. రణం.. అమాయకుల ప్రాణాలు ఖతం

    జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ముహూర్తం షాట్‌ రెడీ కాబోతోంది. దీంతో అన్ని పార్టీలు సిద్ధపడుతున్నాయి ఈ ఎన్నికల కోసం. మరోవైపు ప్రభుత్వం కూడా ఎక్కువ గ్యాప్‌ ఇవ్వకుండా వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది. ఎక్కడ గ్యాప్‌ ఇస్తే.. బీజేపీ మరింత ఎక్కడ పుంజుకుంటుందోనని మదన పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వీలైనంత తక్కువ టైంలోనే ఎన్నికలు జరిపి సత్తా చాటాలని చూస్తోంది.

    జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకవర్గం టైం 2021 ఫిబ్రవరి వరకు ఉంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించి సత్తా చాటాలని సెంచరీ దాటేయాలని టీఆర్ఎస్ శ్రేణులు కలలుకంటున్నాయి. దుబ్బాక రిజల్ట్ తో  సెంచరీ సంగతి దేవుడెరుగు.. అసలు ఎన్నికల్లో మెజార్టీ సీట్లు వస్తాయా లేదా అనే అనుమానం కూడా పట్టుకుంది. కొన్నాళ్లు వేచి చూడటం మంచిదని కేసీఆర్ భావిస్తుండగా.. కేటీఆర్ మాత్రం దూకుడుగానే ఉన్నారట. ఎన్నికలకు తాము సర్వం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. వరద రాజకీయాలు, బురద రాజకీయాలు, నిస్సహాయ మంత్రి అంటూ.. బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

    Also Read: రైతులకు శుభవార్త: ఆ ‘స్కీమ్’తో అదిరిపోయే రాబడి!

    ఈ క్రమంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌‌ సమావేశం కాబోతోంది. 11 రాజకీయ పార్టీలు ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాన్ని తెలియజేయనున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఎస్ఈసీ ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్టీలు వేర్వేరు సమాధానాలిచ్చాయి. ఇక గ్రేటర్ ఎన్నికల విషయం ఈరోజు తేలుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధంగా ఉన్నాయా.. కరోనా పేరు చెప్పి వాయిదా కోరుతాయా అనేది తేలాల్సి ఉంది. మిగతా పార్టీల విషయం పక్కనపెడితే అసలు అధికార టీఆర్‌‌ఎస్‌ పార్టీ ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతోందో ఆసక్తిగా మారింది. మరోవైపు కేసీఆర్ కూడా ఈరోజు మంత్రులతో సమీక్ష నిర్వహించబోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై ఆయన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ తర్వాత బల్దియా పోరుపై స్పష్టత వస్తుందని సమాచారం.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్