https://oktelugu.com/

పోతిరెడ్డిపాడుపై ముందుకు వెళ్లొద్దు..!

ప్రాజెక్టు సామర్థ్యం పెంపు విషయంలో తెలంగాణా ప్రభుత్వ, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీ ఓ నెంబర్ 203 పై అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకుండా నిలిపి వేయాలని కోరింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధమన్న అభిప్రాయాన్ని బోర్డు వ్యక్తం చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ […]

Written By: , Updated On : May 16, 2020 / 10:34 AM IST
Follow us on

ప్రాజెక్టు సామర్థ్యం పెంపు విషయంలో తెలంగాణా ప్రభుత్వ, రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఈ మేరకు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లేఖ రాసింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీ ఓ నెంబర్ 203 పై అభ్యంతరం వ్యక్తం చేసింది. కొత్త ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకుండా నిలిపి వేయాలని కోరింది. రాష్ట్ర పునర్విభజన చట్టానికి ఇది విరుద్ధమన్న అభిప్రాయాన్ని బోర్డు వ్యక్తం చేసింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అదనంగా 3 టీఎంసీ ల నీటిని పంప్ చేసే కొత్త ప్రాజెక్టుపై వివరణ ఇవ్వాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ కోరింది. వెంటనే ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియచేయాలని బోర్డు సభ్యులు హరికేశ్ మినా రాష్ట్ర జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్ దాస్ కు లేఖలో సూచించింది.

మరోవైపు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచే అంశంపై తన వాదనలు వ్8నిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమలో నీటి సమస్య బోర్డు దృష్టికి తీసుకువెళ్లి, కృష్ణా జిల్లాలో ఏపీకి రావాల్సిన వాటాను మాత్రమే తీసుకుంటున్నామని, వరదల సమయంలో సముద్రం పాలవుతున్న మిగులు జలాలను రాయలసీమకు పోతిరెడ్డిపాడు నుంచి తరలించాలని భావిస్తున్నట్లు వివరించనున్నారు. ఈ విషయంలో తెలంగాణా అభ్యంతరాలు అర్ధరహితమని వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాద్ దాస్, ఇతర జలవనరుల శాఖ అధికారులు ఢిల్లీ వెళ్లి కృష్ణా బోర్డుకు తమ వాదనలు వినిపించనున్నారు