గెజిటను సస్పెండ్ చేసిన హైకోర్టు..!

రాజధాని అమరావతిలో ఆర్‌ 5 జోన్‌ ను ప్రకటిస్తూ ఇచ్చిన గ్రెజిట్‌ నోటిఫికేషన్ 355ను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ ఫ్లాన్‌లో మార్పులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను తప్పుపట్టింది. సీఆర్డీఏలోని సెక్షన్‌ 41 ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ని మార్పు చేయాలంటే స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనను కూడా హైకోర్టు విన్నది. ఇరువాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ […]

Written By: Neelambaram, Updated On : May 15, 2020 8:09 pm
Follow us on

రాజధాని అమరావతిలో ఆర్‌ 5 జోన్‌ ను ప్రకటిస్తూ ఇచ్చిన గ్రెజిట్‌ నోటిఫికేషన్ 355ను నాలుగు వారాల పాటు హైకోర్టు సస్పెండ్‌ చేసింది. రాజధాని మాస్టర్‌ ఫ్లాన్‌లో మార్పులకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియను తప్పుపట్టింది. సీఆర్డీఏలోని సెక్షన్‌ 41 ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ని మార్పు చేయాలంటే స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనను కూడా హైకోర్టు విన్నది. ఇరువాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం వేసవి సెలవుల అనంతరం జూన్‌ 17కు వాయిదా వేసింది.

రాజధాని ప్రాంతంలో ఆర్‌5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల వారితో పాటు గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ఈ మండలాలకు చెందిన వారికి స్థలాలు ఇచ్చేందుకు 1,300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందుకోసం ఆర్5ను ప్రభుత్వం సృష్టించిన విషయం విదితమే. సీఆర్‌డీయే చట్టాన్ని, అందులోని మాస్టర్ ప్లాన్‌ను మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ ప్రతిపాదనలు చట్టపరమైన ప్రక్రియను, నింబంధనను పాటించకుండా చేస్తున్నారని, సీఆర్‌డీయే చట్టానికి, మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రక్రియ జరుగుతోందని రాజధాని రైతులు హైకోర్టు ఆశ్రయించారు. రాజధాని రైతుల వాదనపై సంతృప్తి చెందిన హైకోర్టు ప్రభుత్వం ఆర్ 5 జోన్ మార్పు చేసిన ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని తేల్చింది.