Homeజాతీయ వార్తలుKomatireddy Raj Gopal Reddy: బీజేపీ–బీఆర్‌ఎస్‌ ఒక్కటేనా.. అ నేతలను ఎందుకు అనుమానిస్తున్నారు?

Komatireddy Raj Gopal Reddy: బీజేపీ–బీఆర్‌ఎస్‌ ఒక్కటేనా.. అ నేతలను ఎందుకు అనుమానిస్తున్నారు?

Komatireddy Raj Gopal Reddy:  తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య రహస్య ఎజెండా ఉందా… పరస్పర సహకారంతో రెండు పార్టీలు పనిచేస్తున్నాయా? కేంద్రంలోని బీజేపీపై, ప్రధాని మోదీపై బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్న యుద్ధం పైపైకేనా.. అసలు రహస్య ఎజెండా అంశం బీజేపీ రాష్ట్ర నేతలకు తెలియదా? బీజేపీలో ఇటీవల చేరిన ఆ ఇద్దరు నేతలు అనుమానం నిజమేనా? పార్టీ రాష్ట్ర నాయకత్వం గానీ, జాతీయ నాయకత్వం గానీ అనుమానాలు ఎందుకు నివృత్తి చేయడం లేదు.. ఇవీ ప్రస్తుతం బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలను కలవర పెడుతున్నాయి. మొన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి,.. నిన్న కోమటిరెడ్డి రాజగపాల్‌రెడ్డి లేవనెత్తిన అనుమానాల ఇప్పుడు అందరిలోనే తలెత్తుతున్నాయి. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కూరుకుపోయిన కవితను అరెస్ట్‌ చేయకపోవడం వెనుక కేసీఆర్‌ లాబీయింగ్‌ ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అత్యంత అవినీతి సీఎం..
దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఆయన కూతురు కవిత కూడా లిక్కర్‌ స్కాంలో ఉందన్న విషయం అందరికీ తెలిసినా అరెస్ట్‌ చేయడంలో తాత్సారం చేయడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, భూముల విక్రయం, తాజాగా 111 జీవో ఎత్తివేయడం వరకు అన్నీ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి చేసినవే అని తెలిపారు. అన్ని పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నా.. చర్యలు తీసుకోవడంలో కేంద్రం జాప్యం చేయడంపై ప్రజల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. లిక్కర్‌ స్కాం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సైతం అరెస్ట్‌ చేసిన సీబీఐ కవితను అరెస్ట్‌ చేయకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.

ఆలస్యంతో పార్టీకే నష్టం..
అవినీతిపై విచారణ జరిపించడంలో, కవిత అరెస్ట్‌ విషయంలో కేంద్రం ఆలస్యం చేసే కొద్ది తెలంగాణలో బీజేపీకి నష్టం జరగుతుందని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. తాము పార్టీకి నష్టం చేయాలని ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, పార్టీ అధికారంలోకి రావాలంటే.. అవినీతిపరుల భరతం పట్టాలన్నారు. ఈమేరకు తాము కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు. పార్టీ అధ్యక్షుడితో కలిసి కేంద్ర హోం మంత్రికి కూడా ఫిర్యాదు చేశామన్నారు. ఇకనైనా ఆలస్యం చేయకుండా కేంద్రం స్పందించాలని, అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, ఆయన కొడుకు కేటీఆర్, కూతరు కవిత స్కాంలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే తెలంగాణ ప్రజల్లో బీజేపీపై నమ్మకం కలుగుతుందని, వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version