AP CM Jagan : అమరావతికి జై కొట్టిన జగన్

తప్పుడు వాగ్దానాలతో చంద్రబాబు మోసం చేశారు. ఎప్పుడైనా మోసం చేసే వారిని నమ్మకండి. నరకాసూరుడినైనా నమ్మవచ్చు. కానీ నారా చంద్రబాబు నాయుడిని నమ్మలేం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Written By: Dharma, Updated On : May 26, 2023 1:49 pm
Follow us on

AP CM Jagan : వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా అమరావతిలో అడుగుపెట్టిన సీఎం జగన్ రీ సౌండ్ చేశారు. అమరావతికి జై కొట్టారు. ఇది మన అందరి అమరావతి అని నినదించారు. రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా చంద్రబాబుపై అటాక్ చేశారు.  అమరావతిలో 51 వేల మంది ఇళ్ల పట్టాలు కేటాయించిన సంగతి తెలిసిందే. శుక్రవారం అమరావతి వెళ్లిన జగన్ లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మారీచులు, రాక్షసులు అడ్డుపడినా పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా 33 వేల ఎకరాలను సేకరించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములను ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిని నిర్వీర్యం చేసింది. మూడు రాజధానులను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం రాజధానుల అంశం కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు జగన్ సర్కారు ముందుకొచ్చింది. దీనిపై కోర్టులో ప్రజావాజ్యం కేసులు నమోదయ్యాయయి. సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో 51 వేల మందికి ఇళ్ళ పట్టాలు అందించేందుకు వైసీపీ సర్కారు సిద్ధపడింది.

ఇళ్ల పట్టాల పంపిణీని సీఎం జగన్ పూర్తిగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. సభలో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకులు ఎప్పుడైనా ఇలా చేశారా? టీడీపీ హయాంలో టిడ్కొ ఇళ్లు పూర్తయితే ప్రజలు జగన్ ను ఎందుకు ఆదరిస్తారని సీఎం ప్రశ్నించారు. అందుకే గతానికి ఇప్పటికీ తేడా చూడండి. చంద్రబాబు హయాంలో సెంటు భూమి కూడా పేదలకు ఇచ్చిన పాపాన పోలేదు. ఇళ్ల నిర్మాణ విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు వాగ్దానాలతో చంద్రబాబు మోసం చేశారు. ఎప్పుడైనా మోసం చేసే వారిని నమ్మకండి. నరకాసూరుడినైనా నమ్మవచ్చు. కానీ నారా చంద్రబాబు నాయుడిని నమ్మలేం అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జూలై 8న వైఎస్సార్ జయంతి రోజుల ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహిస్తామని జగన్ ప్రకటించారు. ఇళ్ల నిర్మాణానికి కూడా పెద్దఎత్తున సాయం చేస్తామన్నారు.ప్రస్తుతం ఎక్కడా లంచాలు, వివక్షలు లేని విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలన్నారు.  మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్ గా, ఖురాన్ గా భావించామని..ఆర్ధిక సవాళ్లు ఎన్ని వచ్చినా వెనక్కి తగ్గలేదన్నారు. ఇప్పటివరకు 3 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో వేశామన్నారు.  రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుందని.. ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన ప్రతిఒక్కరూ ఆదరించాలని కోరారు.