Komatireddy: హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ముందంజలో నిలుస్తున్నారు. ప్రతి రౌండ్ లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ధరదాహానికి పరాకాష్టగా ఈ ఎన్నిక నిలిచిందని కోమటిరెడ్డి పేర్కొనడం సంచలనంగా మారింది. హుజురాబాద్ లో అధికార పార్టీ ఐదు నెలల్లో ఐదు వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ మధ్దతు ఇచ్చిందని బాంబు పేల్చారు. దీంతోనే టీఆర్ఎస్ పార్టీ ఓటమి దిశగా వెళుతోందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే ఈటలకు తక్కువ ఓట్లు వచ్చేవని పేర్కొన్నారు. గట్టిగా పోరాడితే ఓట్లు చీలి టీఆర్ఎస్ కే లాభం జరిగేదన్నారు.
కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశం అవుతోంది. ఈటలకు పరోక్షంగా మద్దతు ఇచ్చామని బహిరంగంగా చెప్పడం గమనార్హం. కోమటిరెడ్డి ఏది చేసినా సంచనమే. ఏం మాట్లాడినా వివాదాస్పదమే కావడం తెలిసిందే. ప్రస్తుతం ఈటల మీద తన మనసులోని మాటను బయటపెట్టి అందరిని గందరగోళంలో పడేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: టీఆర్ఎస్ గెలిస్తేనే ఆ నేతకు రాజకీయ భవిష్యత్తు.. ఎవరాయన ? ఎందుకు ?
ప్రతి రౌండ్ లో ఈటల ఆధిపత్యం కొనసాగిస్తున్నా పదకొండో రౌండ్ లో మాత్రం టీఆర్ఎస్ కు స్వల్ప ఆధిక్యం వచ్చింది. దీంతో బీజేపీ గెలుపు ఖాయమనే అంచనాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఓటమి అంచుల్లోకి వెళ్లిందని తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతల్లో హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: Gellu Srinivas Yadav: ఎంతటి అవమానం.. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు సొంతూరి వాసుల షాక్