కోమటిరెడ్డిపై నజర్ పెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేతలు

తెలంగాణలో పీసీసీ చీఫ్ మార్పు ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం నేతలకు సిగ్నల్ ఇచ్చింది. అయితే పీసీసీని మార్చేందుకు యత్నిస్తున్న ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి వస్తుండటంతో వాయిదా వేస్తూ పోతుంది. త్వరలోనే పీసీసీ మార్పు తథ్యమనే సంకేతాలు రావడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అలర్ట్ అయ్యారు. ఈ పదవీ కోసం చాలామంది నేతలు పోటీపడుతున్నారు. సీఎం పీఠానికి పీసీసీ చీఫ్ పదవీ దగ్గరిదారి కావడంతో కాంగ్రెస్ లోని సీనియర్లంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. పీసీసీ పదవీ […]

Written By: Neelambaram, Updated On : June 16, 2020 4:07 pm
Follow us on


తెలంగాణలో పీసీసీ చీఫ్ మార్పు ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం నేతలకు సిగ్నల్ ఇచ్చింది. అయితే పీసీసీని మార్చేందుకు యత్నిస్తున్న ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి వస్తుండటంతో వాయిదా వేస్తూ పోతుంది. త్వరలోనే పీసీసీ మార్పు తథ్యమనే సంకేతాలు రావడంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అలర్ట్ అయ్యారు. ఈ పదవీ కోసం చాలామంది నేతలు పోటీపడుతున్నారు. సీఎం పీఠానికి పీసీసీ చీఫ్ పదవీ దగ్గరిదారి కావడంతో కాంగ్రెస్ లోని సీనియర్లంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

పీసీసీ పదవీ రేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి పేర్లు ప్రముఖంగా విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేసేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు మాత్రం రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి పీసీసీ పదవీ కట్టబెడితే కాంగ్రెస్ శ్రేణులకు తప్పుడు సందేశం పోతుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా సేవలు చేస్తున్న వారికి పీసీసీ పదవీని కట్టబెట్టాలని సీనియర్ నేతలు అధిష్టానికి సూచిస్తున్నారు.

ఈనేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పీసీసీ కోసం పావులు కదుపుతున్నారు. పీసీసీ ఛీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీకాలం పూర్తవడంతో ఆయన స్థానంలో కోమటిరెడ్డి రావాలని చూస్తున్నారు. గతంలో ఉత్తమ్ కుమారెడ్డిపై కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తమ్-కోమటిరెడ్డిలు ఉప్పునిప్పులా ఉండేవాడు. ఇప్పుడు ఉత్తమ్ తో కోమటిరెడ్డి సన్నిహితంగా ఉంటున్నాడు. ఉత్తమ్ చేపట్టిన కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నాడు. ఉత్తమ్ సిఫార్సుతో పీసీసీ పదవీ దక్కించుకునేందుకు కోమటిరెడ్డి పావులు కదుపుతున్నాడనే టాక్ విన్పిస్తోంది.

ఈనేపథ్యంలోనే ఎప్పుడూ నియోజకవర్గానికే పరిమితమయ్యే కోమటిరెడ్డి ఇటీవలీ కాలంలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో విమర్శించినోళ్లనే ఇప్పుడు ప్రశంసిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ఎప్పుడూ కలవని నేతలను సైతం కలుస్తూ కాంగ్రెస్ లో సరికొత్త రాజకీయం చేస్తున్నాడు. తాజాగా కోమటిరెడ్డి ఉత్తర తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణ వెనుబాటుకు గురవుతుందని కొత్త వాదన తెరపైకి తెచ్చాడు దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నాడని గళమెత్తుతున్నాడు. ప్రాజెక్టుల వద్ద దీక్ష సందర్శనలు అంటూ హడావుడి చేస్తున్నాడు. నల్గొండ సమస్యలతోపాటు తెలంగాణ సమస్యలను ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కోమటిరెడ్డిలో వచ్చిన ఈ మార్పుపై పలువురు కాంగ్రెస్ సీనియర్ కూడా నజర్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా పీసీసీ పదవీ కోసం కోమటిరెడ్డి ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకున్నాడు. ఈసారైనా కోమటిరెడ్డికి పీసీసీ పదవీ దక్కుతుందో? లేదో అనేది వేచి చూడాల్సిందే..!