Munugodu By-Elections : మనుగోడు ఉపఎన్నికలలో ఓడిపోయిన బాధతో రాజకీయ సన్యాసం తీసుకోనున్న కోమటిరెడ్డి..?

Munugodu By-Elections Komatireddy Rajagopal Reddy : మనుగోడు ఉప ఎన్నికలను టీఆర్ఎస్ -బీజేపీ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేశాయో మన అందరం చూసాం.. గత కొద్ది రోజుల క్రితం నుండి మీడియా లో ఈ ఉపఎన్నికల గురించే చర్చ..తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంతతి ఉత్కంఠ భరితమైన వాతావరణం ని ఏర్పర్చిన ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి..ఇన్ని రోజులుగా ఎవరు గెలుస్తారా అని జనాల్లో కలిగిన ఉత్కంఠకి తెరదించుతూ అధికార TRS పార్టీ […]

Written By: NARESH, Updated On : November 6, 2022 5:42 pm
Follow us on

Munugodu By-Elections Komatireddy Rajagopal Reddy : మనుగోడు ఉప ఎన్నికలను టీఆర్ఎస్ -బీజేపీ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీ చేశాయో మన అందరం చూసాం.. గత కొద్ది రోజుల క్రితం నుండి మీడియా లో ఈ ఉపఎన్నికల గురించే చర్చ..తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అంతతి ఉత్కంఠ భరితమైన వాతావరణం ని ఏర్పర్చిన ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి..ఇన్ని రోజులుగా ఎవరు గెలుస్తారా అని జనాల్లో కలిగిన ఉత్కంఠకి తెరదించుతూ అధికార TRS పార్టీ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థి బీజేపీ పార్టీ అభ్యర్థి అయినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై భారీ మెజారిటీ తో గెలుపొందాడు.

సిట్టింగ్ ఎమ్యెల్యే గా కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతూ వచ్చిన కోమటిరెడ్డి తన ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీ లో చేరడం వల్లే ఈ ఉపఎన్నిక వచ్చింది..కోమటిరెడ్డి కి తన గెలుపు పై చాలా ధీమా ఉండేది..నా విజయం ని ఎవ్వరు ఆపలేరు అనే స్థాయిలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాడు.

అధికార తెరాస పార్టీ కి గట్టిపోటీని ఇచ్చాడు కానీ చివరికి భారీ మెజారిటీ తో ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది..అయితే ఎన్నికల ప్రచారం లో ఆయన ‘తెరాస పార్టీ నాపైన గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేపడుతాను..ఛాలెంజ్’ అంటూ మీడియా ముఖంగా తెలిపాడు..ఇప్పుడు ఆయన ఓడిపోవడం తో నిజంగానే రాజకీయ సన్యాసం చేపట్టబోతున్నారా లేదా అనేది చూడాలి .

ఫలితాలు వెలువడిన తర్వాత కోమటిరెడ్డి మీడియా తో మాట్లాడుతూ ‘నేను నైతికంగా గెలిచాను..తెరాస పార్టీ గెలుపు అనైతికం..నన్ను ఓడించడానికి అసెంబ్లీ మొత్తం మనుగోడులోనే తిష్ట వేసింది..డబ్బుల ప్రవాహం ఏరులై పారింది..గ్రామానికి ఒక ఎమ్యెల్యే ని దింపారు..ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి చివరికి గెలిచారు..కానీ ప్రజాతీర్పుని మనం గౌరవించాలి కాబట్టి ఈ ఓటమిని నేను స్వీకరిస్తున్నాను..నాకు ఓట్లు వేసిన ప్రతిఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు’ అని చెప్పుకొచ్చాడు కోమటిరెడ్డి.