Homeజాతీయ వార్తలుబీజేపీలోకి కోమటిరెడ్డి? కిషన్ రెడ్డితో భేటీ?

బీజేపీలోకి కోమటిరెడ్డి? కిషన్ రెడ్డితో భేటీ?

తెలంగాణ కాంగ్రెస్ లో సమీకరణలు మారుతున్నాయని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని ప్రకటించాక సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి నుంచి ఉన్న తమకు కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బహిరంగంగా తనలోని ఆవేశాన్ని వెల్లగక్కారు. దీంతో కాంగ్రెస్ లో ఏం జరుగుతుందోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

పార్టీలో చెలరేగిన అసమ్మతి పార్టీ ఫిరాయింపుల వరకు వెళ్లే లా ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా పరిణామాలు కూడా అలాగే ఉంటున్నాయి. సమయం కోసం వేచి చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బయటకొచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.

అయితే ఆయన బీజేపీలో చేరిన కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే బాటలో నడుస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. పీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ వెంకటరెడ్డి దానిపై ఎన్నో ఆశలుపెంచుకున్నారు. అందరికన్నా సీనియర్ అయిన తనకే పదవి వస్తుందని ఆశించారు. చివరకు పదవి దక్కపోవడంతో అధిష్టానంపైనే ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కాస్త నెమ్మదించినా ఆయన తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఆయనకు పదోన్నతి సాధించినందుకు గాను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భువనగిరి కోటను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో వారి మధ్య జరిగిన సమావేశాన్ని రాజకీయ కోణంలో చూడాల్సి వస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కిషన్ రెడ్డితో సమావేశం అయినట్లు భావిస్తున్నారు.

పీసీసీ పీఠం దక్కకపోవడంతో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ సైతం రాశారు. రేవంత్ రెడ్డి ఎన్ని పార్టీలు మారినా ఆయనకే పదవి ఇవ్వడంపై తట్టుకోలేకపోయారు. దీనివల్ల అసలు కాంగ్రెస్ నాయకులకు న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే కిషన్ రెడ్డితో భేటీ అయినట్లు సమాచారం.

కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో కోమటిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇక తాను గాంధీభవన్ మెట్లు ఎక్కనని ఆనాడే చెప్పారు. రేవంత్ రెడ్డి అసలైన కాంగ్రెస్ వాది కాదంటూ నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సైతం హాజరు కాలేదు. దీంతో ఆయనలో ఇంకా కోపం తగ్గలేదని తెలుస్తోంది. దీంతోనే పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular