Kolkata Doctor Case: దేశంలో సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యాచారం, హత్య ఘటనపై విచారణ కొనసాగుతోంది. మొదట రాష్ట్ర పోలీసులు ఈ ఘటనపై విచారణ జరిపారు. తర్వాత కోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ చేపట్టింది. మూడు రోజుల క్రితం మధ్యంతర నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. మరోవైపు ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌తోపాటు మరో ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరింది. కోల్‌కతా కోర్టు ఇందుకు అనుమతి ఇవ్వడంతో శనివారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సాంకేతిక సమస్యతో నిర్వహించలేదు. ఆదివారం పాలిగ్రఫీ టెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు కీలక విషయాలు వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. విచారణలో నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు వివరాలను వెల్లడించారు. ఇదిలా ఉంటే వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను శిక్షించేందుకు కఠినమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం లేఖపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి సీఎం మమతా బెనర్జీకి సోమవారం లేఖ రాశారు.
ప్రారంభం కాని ప్రత్యేక కోర్టులు..
ఇదిలా ఉంటే.. మహిళలు, చిన్నారులపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు పశ్చిమబెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం 123 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను కేటాయించింది. వీటిలో ఇప్పటికీ చాలా వరకు ప్రారంభించలేదు. మమత సర్కార్ మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని, మహిళలు, చిన్నారులపై వివక్ష, హింసను నియంత్రించేందుకు. తక్షణమే సమర్థమంతమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు, మహిళలు విమర్శలు గుప్పిస్తున్నారు. కోల్‌కతాలో హత్యాచారానికి గురైన డాక్టర్ తల్లిదండ్రులకు నా సంతానం, గత నెలలో దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ద్వారా కఠినమైన శిక్షలను అమలు చేస్తున్నాం. దీని ద్వారా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను అడ్డుకుంటున్నాం. ఇక పాస్ట్ ట్రాక్ కోర్టుల విషయానికొస్తే.. ఈ కోర్టులను ఏర్పాటు చేసేందుకు 2019లో కేంద్రం పథకం ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 30 జూన్ 2024 నాటికి, 409 ప్రత్యేకమైన పోక్సో కోర్టులతో సహా 752 ఎఫ్‌టీఎస్సీలు పని చేస్తున్నాయి. వీటి కింద 2,53,000 కంటే ఎక్కువ కేసులు పరిష్కరం వపొందాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మొత్తం 123 ఎఫ్టీఎస్ సీల కేటాయింపు జరిగింది. ఇందులో 20 ప్రత్యేక పోక్సో కోర్టులు 103 ఎఫెటీఎస్సీలు ఉన్నాయి. అయితే వీటిలో ఏవి కూడా 2023 జూన్ వరకు పనియలేదు.
48,600 లైంగికదాడి, పోక్సో కేసులు
రాష్ట్రంలో 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ, ఇంకా 11 పాస్ట్ ట్రాక్, ప్రత్యేక కోర్టులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఉమెన్ హెల్ప్ లైన్ 181, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112, చైల్డ్ హెల్ప్ లైన్ 1098లను సమర్థంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో ఈ సేవలు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గుర్తు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా ఏకీకృతం చేయలేదు. ఈ లోపం కారణంగా రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులు ఆపద సమయంలో అవసరమైన సహాయాన్ని కోల్పోతున్నారు’ అని మండిపడ్డారు
పెరుగుతున్న లైంగిక దాడులు..
కాగా దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయి. దీంతో గతవారం మమతా బెనర్జీ ప్రధానినరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో రోజుకు 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని, వీటిలో చాలా సందర్భాల్లో బాధితులు హత్యకు గురవుతున్నారని తెలిపారు. ఇదంతా చూస్తుంటే. భయంకరంగా ఉంది. ఇది సమాజం విశ్వాసాన్ని, మనస్సాక్షిని కదిలిస్తుందని
రక్షణ కల్పించడం కర్తవ్యం..
మహిళలు సురక్షితంగా ఉండేలా వారికి రక్షణ కల్పించడం మన కర్తవ్యం. ఇటువంటి తీవ్రమైన, సున్నితమైన సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా కేంద్రంచ ట్టం తీసుకుకరావాలి. అని ’పేర్కొన్నారు. అదే విధంగా అటువంటి: కేసులను త్వరగా పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆమె సూచించారు.