https://oktelugu.com/

Ex Minister Rk Roja: వైసీపీని రోజా వదిలించుకున్నారా? ఫైర్ బ్రాండ్ ను పార్టీ పక్కన పెట్టిందా? ఏం జరిగింది?

వైసీపీ ఫైర్ బ్రాండ్లలో మాజీ మంత్రి రోజా ఒకరు. ప్రత్యర్థులపై విరుచుకు పడడంలో ముందంజలో ఉండేవారు. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. సొంత పార్టీ వారే ఆమెను వ్యతిరేకించారు. ఇప్పుడు ఆమె పార్టీ పేరు చెప్పేందుకు కూడా ఇష్టపడడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : August 27, 2024 / 10:19 AM IST

    Ex Minister Rk Roja

    Follow us on

    Ex Minister Rk Roja: మాజీ మంత్రి రోజా వైసిపి వీడేందుకు దాదాపు డిసైడ్ అయ్యారా? ఆ పార్టీని వద్దనుకుంటున్నారా? రాజకీయాల నుంచి నిష్క్రమించాలని భావిస్తున్నారా? లేకుంటే ఏపీ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఆమె కేవలం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అని చెప్పుకునేందుకే ఇష్టపడుతున్నారు. వైసీపీ అన్న పదం ఉపయోగించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జగన్ ఫోటోలు సైతం వినియోగించడం లేదు. హెడర్ లో తన వైసిపి ఆనవాళ్లు లేవు. బయోలో తాను వైసీపీ నాయకురాలిన అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నది వైసీపీలో చర్చగా మారింది. సాధారణంగా సినీ రంగంలో ఉన్నవారు విడాకులు తీసుకునేటప్పుడు, ఎవరితోనైనా విభేదాలు వచ్చినప్పుడు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేస్తారు. కలిసి ఉన్న ఫోటోలను తీసేస్తారు. ఇప్పుడు మాజీ మంత్రి రోజా అదే ఫాలో అయ్యారు. వైసీపీని అన్ ఫాలో చేశారు. కనీసం ఆ పార్టీ ఆడవాళ్లు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో రోజా తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

    * వ్యతిరేకించిన క్యాడర్
    నగిరి నియోజకవర్గం నుంచి మొత్తం ఐదు సార్లు పోటీ చేశారు రోజా. కానీ రెండుసార్లు మాత్రమే గెలిచారు. మూడుసార్లు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దని నగిరి పార్టీ క్యాడర్ ముక్తకంఠంతో కోరింది. అయినా సరే జగన్ ఆమెకు టిక్కెట్ ఇచ్చారు. కానీ ఆమె క్యాడర్ను కలుపుకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. జగన్ ప్రభంజనంలో మళ్లీ గెలుస్తానని భావించారు. కానీ దారుణంగా ఓడిపోయారు.

    * నగిరి కి దూరం
    ఓడిపోయిన నాటి నుంచి రోజా బయటకు కనిపించడం లేదు. నగిరి లో ఉండడం లేదు. పార్టీ సమావేశాలు నిర్వహించడం లేదు. ఓటమిపై ఎటువంటి సమీక్ష చేయలేదు. ఆమె ఎక్కువగా తమిళనాడుకు పరిమితమవుతున్నారు. ఆమె భర్త తమిళ దర్శకుడు కావడంతో అక్కడ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరి చక్రం తిప్పాలని రోజా భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. తెలుగు కంటే తమిళ రంగంలోనే రాణించాలని భావిస్తున్నట్లు సమాచారం.

    * ఆమెకు సమాచారం లేదు
    అయితే రోజా ఇప్పుడు వైసీపీని వదిలించుకోవడం వెనుక పెద్ద కథ నడిచినట్లు తెలుస్తోంది. నగిరి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఆమెకు తప్పించనున్నట్లు సమాచారం. పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో పోటీ చేసిన వారే ఇన్చార్జిలుగా ఉన్నారు. వారే పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. ఈ విషయంలో రోజాకు ఎటువంటి సమాచారం లేదు. పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఆమెకు సీన్ అర్థమైంది. పార్టీ తప్పించనుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే రోజా వైసిపికి దూరంగా జరిగిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.