కోకాపేట స్కాం: రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

కోకాపేట భూములు అమ్మి రూ.2వేల కోట్ల లాభాలను తెలంగాణ ప్రభుత్వం పొందింది. అయితే ఈ కోకా పేట భూముల విక్రమంలో భారీ స్కాం జరిగిందని ఆరోపిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ ఆన్ లైన్ టెండర్ పేరిట జరిగిన వేలంలో పాలకవర్గం బినామీలే పాల్గొన్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నేతల కుటుంబాల వారే భూములు కొన్నారని తెలిపారు. ఆన్ లైన్ ద్వారా జరిగే వేలంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయని.. తద్వారా […]

Written By: NARESH, Updated On : July 17, 2021 5:14 pm
Follow us on

కోకాపేట భూములు అమ్మి రూ.2వేల కోట్ల లాభాలను తెలంగాణ ప్రభుత్వం పొందింది. అయితే ఈ కోకా పేట భూముల విక్రమంలో భారీ స్కాం జరిగిందని ఆరోపిస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ ఆన్ లైన్ టెండర్ పేరిట జరిగిన వేలంలో పాలకవర్గం బినామీలే పాల్గొన్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ నేతల కుటుంబాల వారే భూములు కొన్నారని తెలిపారు.

ఆన్ లైన్ ద్వారా జరిగే వేలంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయని.. తద్వారా ఇక్కడ ఎన్నో అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమలను నెలకొల్పుతాయని చెప్పారని.. కానీ ఇవన్నీ మాయమాటలు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. చివరికి వేలంలో ఏ ఒక్క అంతర్జాతీయ సంస్థ పాల్గొనలేదని.. సీఎం కేసీఆర్ బినామీలే పాల్గొన్నారని సంచలన ఆరోపణలు చేశారు.

భూముల వేలంలో నిబంధనలు ఉల్లంఘించారని.. వేలంలో పాల్గొనవద్దని కొందరిని బెదిరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టెండర్లు వేస్తే నిర్మాణాలకు అనుమతులు రావని మరికొందరిని బెదిరించారని ఆరోపించారు. ఐదు కంపెనీల వారు కలిసి రూ.1000 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టారని ఆరోపించారు.

ఎకరం రూ.60 కోట్లు పలికిన భూమి మినహా మిగతా భూములకు టెండర్లు పిలవాలని.. అక్కడ ఎకరం 50 కోట్లకు తక్కువ లేదని రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై కేంద్రహోంమంత్రికి, ప్రధాని దృష్టికి తీసుకెళుతానని తెలిపారు. ఆధారాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అందిస్తానని.. నా ఫిర్యాదుపై కేంద్రప్రభుత్వం, బీజేపీ స్పందించకపోతే బీజేపీ,-టీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని తేలుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.

చూస్తుంటే రేవంత్ రెడ్డి ఈ కోకాపేట భూముల స్కాంను వదిలిపెట్టేలా కనిపించడం లేదు. దీనిపై టీఆర్ఎస్ సర్కార్ ను సంచలన ఆరోపణలతో ఇరుకునపెడుతున్నారు. ఇక ఇందులో ఇప్పటివరకు స్పందించని బీజేపీని కూడా కార్నర్ చేసే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. మరి ఇది ఎటువైపు దారితీస్తుందనేది వేచిచూడాలి.