అయ్యో.. ఆ నటి జీవితంలో భరించలేని దుఃఖం !

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే జీవితాలు.. ఒక్కోసారి ఎంతో విషాదాన్ని మోస్తూ ఉంటాయి. అయినా, విషాదంలో నుండే హాస్యం పుడుతుంది అన్నాడు చార్లీ చాప్లిన్. నిజమే కావొచ్చు, వెండితెర పై నవ్వులు పూయించిన ఎందరో హాస్యగాళ్ళు, నిజ జీవితంలో మాత్రం ఎంతో సీరియస్ గాళ్లు. తేడా వస్తే.. దేనికైనా రెడీ అనే స్వభావం ఉన్నవాళ్లు. సరే, ప్రస్తుతం మ్యాటర్ లోకి వస్తే.. నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందల సినిమాలు చేసింది సీనియర్ నటి అన్నపూర్ణ. తెలుగు తెర […]

Written By: admin, Updated On : July 17, 2021 4:36 pm
Follow us on

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే జీవితాలు.. ఒక్కోసారి ఎంతో విషాదాన్ని మోస్తూ ఉంటాయి. అయినా, విషాదంలో నుండే హాస్యం పుడుతుంది అన్నాడు చార్లీ చాప్లిన్. నిజమే కావొచ్చు, వెండితెర పై నవ్వులు పూయించిన ఎందరో హాస్యగాళ్ళు, నిజ జీవితంలో మాత్రం ఎంతో సీరియస్ గాళ్లు. తేడా వస్తే.. దేనికైనా రెడీ అనే స్వభావం ఉన్నవాళ్లు. సరే, ప్రస్తుతం మ్యాటర్ లోకి వస్తే.. నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా వందల సినిమాలు చేసింది సీనియర్ నటి అన్నపూర్ణ.

తెలుగు తెర పై తనకంటూ ఓ ప్రత్యేకత సాధించుకున్న అన్నపూర్ణ నిజ జీవితంలో మాత్రం భరించలేని దుఃఖం ఉందని చాలామందికి తెలియదు. ఆమె ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. కానీ, కన్న కూతురు కంటే కూడా ఆ అమ్మాయిని అపురూపంగా పెంచుకున్నారు. అయితే, అంత ప్రేమగా పెంచుకున్న కూతురు ఒక్కసారిగా అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.

ఆ సంఘటన గురించి తల్చుకుని అన్నపూర్ణ ఇప్పటికీ కుమిలిపోతూ ఉంటుంది. మరి ఈ బాధాకరమైన విషయం గురించి అన్నపూర్ణ మాటల్లోనే ‘సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. అందుకే, నా కూతురు కీర్తిని సినిమాల్లోకి పంపించొద్దని నిర్ణయించుకున్నాను. ఆమెను ఇంజనీర్‌ చదివించాలని కలలు కన్నాను. కాకపోతే విధి మరోలా మా జీవితాలను తీసుకువెళ్ళింది.

నా కూతురుకి చదువు అబ్బలేదు. తెలిసిన వాళ్లలో ఓ సంబంధం చూసి పెళ్లి చేశాను. పెళ్లి తర్వాత నా కూతురు చాలా సంతోషంగా ఉంది. ఒక ఏడాదికి ఆమెకు పాప కూడా పుట్టింది. నా కూతురు జీవితం సెటిల్ అయింది అనుకుని ఎంతగానో సంతోషించే లోపే, మా అల్లుడు ఫోన్‌ చేసి మీ కూతురు ఫ్యాన్‌ కి ఉరివేసుకొని చనిపోయిందని చెప్పాడు. కీర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇప్పటికీ నాకు తెలియదు’ అంటూ గతాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంది అన్నపూర్ణ.