https://oktelugu.com/

Sai Pallavi : హిట్ అయితే, క్రెడిట్ ఆమెకే.. మళ్ళీ ఆమె హాట్ టాపిక్ !

Sai Pallavi: సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా రానున్న సినిమా ‘లవ్ స్టోరీ’. చిత్రబృందం సన్నిహితులకు అలాగే కొంతమంది సినిమా వాళ్లకు నిన్న ఈ సినిమా ప్రివ్యూ వేశారు. సినిమా చూసిన వాళ్ళంతా సాయి పల్లవి నటననే మెచ్చుకున్నారట. మొత్తానికి సినిమా హిట్ అయితే, ఆ క్రెడిట్ సాయి పల్లవికే దక్కుతుంది అంటున్నారు. ఆమె నటనలో అలాగే ఆమె వేసే డ్యాన్స్ స్టెప్పుల్లో […]

Written By:
  • admin
  • , Updated On : September 14, 2021 / 01:21 PM IST
    Follow us on

    Sai Pallavi: సెన్సిబుల్ డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా రానున్న సినిమా ‘లవ్ స్టోరీ’. చిత్రబృందం సన్నిహితులకు అలాగే కొంతమంది సినిమా వాళ్లకు నిన్న ఈ సినిమా ప్రివ్యూ వేశారు. సినిమా చూసిన వాళ్ళంతా సాయి పల్లవి నటననే మెచ్చుకున్నారట. మొత్తానికి సినిమా హిట్ అయితే, ఆ క్రెడిట్ సాయి పల్లవికే దక్కుతుంది అంటున్నారు.

    ఆమె నటనలో అలాగే ఆమె వేసే డ్యాన్స్ స్టెప్పుల్లో ఒక గ్రేస్ ఉంటుంది. ఆ గ్రేసే లవ్ స్టోరీకి బాగా హెల్ప్ అయింది. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి స్థాయి పెరుగుతుంది అంటున్నారు. సాయి పల్లవి.. మొహం నిండా మొటిమలు, పెద్ద పొడగరి కాదు, మాట, గొంతు మధురంగా ఉండదు, ఇక ఎక్స్ పోజింగ్ కి అయితే పూర్తీ విరుద్ధం, అలాగే ఆమెకు తెలుగు బాష కూడా రాదు.

    అన్నట్టు పెద్ద పొడుగు జడ కూడా లేదు. ఒక్క మాటలో జస్ట్ ఒక ఎవరేజ్ అమ్మాయి. సహజంగా ఇలాంటి నటిని తీసుకోడానికి మన దర్శకులు కచ్చితంగా జంకుతారు. కానీ సాయి పల్లవి డేట్లు కోసం స్టార్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు క్యూలో ఉన్నారు. సాయి పల్లవి సక్సెస్ వెనుక కారణం ఒక్కటే కనిపిస్తోంది. నిజాయితీ.

    ఆమె నిజాయితీనే ఆమె కళ్ళల్లో కనిపిస్తోంది. అది ఆమె చేసే పాత్రలో ఎలివేట్ అవుతుంది. పైగా సాయిపల్లవి మన ఇంట్లో అమ్మాయిలా ఉంటుంది. తను మన లాగే సామాన్యురాలు అనిపిస్తోంది. అన్నిటికీ మించి సాయి పల్లవి కష్టంతో ఎదిగింది. ఆమెకు ఎమోషన్స్ పై మంచి పట్టు ఉంది. చాలా ఏళ్ళ కిందట తెలుగు ఢీ షోలో పాల్గొని తన ప్రతిభను చూపింది.

    చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించింది. కానీ నేడు సౌత్ ఇండియన్ దర్శకుల కళ్ళలో పడింది. ఏది ఏమైనా సాయి పల్లవి అంటే.. తన నటనతో సినిమా చూసేలా చేయగలదు అనిపించుకుంది.