https://oktelugu.com/

రెచ్చిపోయిన కొడాలి నాని.. పచ్చిబూతులు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా సీఎం జగన్ ను ఉధ్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇదే కోవలో రైతులకు అందిస్తున్న సాయంపై చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలకు మంత్రి కొడాలి నాని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంతటిత ఆగకుండా తీవ్ర పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విధానాలపై నిత్యం విమర్శలుచేస్తున్న విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 19, 2021 / 04:23 PM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా సీఎం జగన్ ను ఉధ్దేశించి టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇదే కోవలో రైతులకు అందిస్తున్న సాయంపై చంద్రబాబు, లోకేష్ చేస్తున్న విమర్శలకు మంత్రి కొడాలి నాని ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అంతటిత ఆగకుండా తీవ్ర పదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు.

    ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విధానాలపై నిత్యం విమర్శలుచేస్తున్న విపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఇవాళ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ర్టంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పాలన అందించాలని సీఎం జగన్ భావిస్తున్నారని తెలిపారు. రైతులను మోసం చేయకుండా ఆదుకోవాలని ఆయన కష్టపడుతున్నారన్నారు. దీంతో23 సీట్లకు పరిమితమైన తుప్పు, పప్పు గాళ్లకు ఏం చేయాలో తెలియడం లేదన్నారు.

    ఎవరో చనిపోతే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, చంద్రబాబు సీఎంకు లేఖ రాశారని మండిపడ్డారు. రైతులకు డబ్బు చెల్లించడం లేదని మీడియాకు రిలీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కట్టకుండా వెళ్లిపోయిన నాలుగు వేల కోట్లు రైతుల బకాయిలు మూడు నెలల్లో చెల్లించిన రైతు బాంధవుడు జగన్ అని ప్రశంసించారు.

    ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో డబ్బు చెల్లిస్తామని, చంద్రబాబు లేఖ రాసే నాటికి రూ.16 వందల కోట్లు చెల్లించామని తెలిపారు. ప్రతి రోజు రూ.200 కోట్ల చొప్పున చెల్లిస్తున్నామన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోతే తామే ఇస్తున్నామని పేర్కొన్నారు. ఆ నిధుల్ని విడుదల చేయమని కేంద్రాన్ని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు.