Kodali Nani- Palanki Brothers: వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది. నియోజకవర్గంలో వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. ఆయన ప్రధాన అనుచరులు సైతం పక్కదారి చూస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా పాలంకి బ్రదర్స్ గా సుపరిచితులైన సారధిబాబు, మోహన్ బాబులు జనసేన గూటికి చేరారు. వైసీపీ ప్లీనరీ జరుగుతున్న సమయంలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలోచేరారు. దీంతో కొడాలి నానికి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యంది. పాలంకి బ్రదర్స్ కొడాలి నానికి ప్రధాన అనుచరులుగా ఎదిగారు. వైసీపీ ఆవిర్భావం నుంచి నానితో కలిసి పనిచేస్తున్నారు. గత కొద్దిరోజులుగా నాని వ్యవహార శైలి నచ్చక ఆయనకు దూరంగా ఉన్నారు. నాని విధానాలు నచ్చకే తాము జనసేనలో చేరినట్టు పాలంకి బ్రదర్స్ తెలిపారు. వ్యక్తిగత విమర్శలు చేయవద్దని కొడాలి నానికి చెప్పినా వినలేదని.. పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడేవారని.. అది నచ్చకే తాము వైసీపీని వీడినట్టు తెలిపారు. నాని ఒంటెద్దు పోకడలతో ముందుకు సాగుతున్నారని..విజయగర్వంతో ఎగిరిపడుతున్నారని.. వైసీపీలో చాలామందికి ఆయన తీరు నచ్చడం లేదని.. వారంత త్వరలో పార్టీని వీడడం ఖాయమని సారధిబాబు, మోహన్ బాబులు తెలిపారు. గుడివాలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా క్రుషి చేస్తామన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలతో..
గుడివాడ నాది.. నన్నెవరూ పీకలేరంటూ ఇటీవల వరకూ కొడాలి నాని వ్యాఖ్యానాలు చేసేవారు. అయితే పరిస్థితి ఇప్పుడు మారినట్టు తెలుస్తోంది. ప్రధాన అనుచరులు., ఇప్పటివరకూ తన వెంట నడిచినా చాలా మంది పక్కచూపులు చూస్తుండడంతో నానిలో ఆందోళన కనిపిస్తోంది. ప్రధానంగా ఎక్కువ మంది జనసేన వైపు చూస్తుండడం నానికి మింగుడుపడడం లేదు. పవన్ అంటేనే ఆది నుంచి నాని ఎగిరిపడేవారు. స్థాయికి మించి విమర్శలు చేసేవారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకునేవారు. రెండు నియోజకవర్గాల్లో ఓటమి చవిచూశారంటూ ఎగతాళిగా మాట్లాడేవారు. ఎంతమంది ఏకమైనా తనను గుడివాడలో ఓడించలేరని సవాల్ విసిరారు. అయితే ఆయన చర్యలతో సొంత పార్టీ శ్రేణులే విసిగి వేశారిపోయాయి.
Also Read: Heavy Rains: ఏపీ, తెలంగాణకి బిగ్ అలెర్ట్.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే
నాని మంత్రిగా ఉన్నన్నాళ్లూ ఎవరూ బయటపడలేదు. ఎప్పుడైతే నానికి మంత్రి పదవి ఊడి ఎమ్మెల్యేగా మిగిలారో అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. పార్టీలో అసంత్రుప్త జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పదేళ్లుగా పార్టీ జెండా మోసినవారు సైతం నాని చర్యలతో ఇబ్బందిపడుతున్నారు. వారంతా ఇప్పుడు టీడీపీ కాకుండా జనసేనను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అలయెన్స్ అయితే మాత్రం నానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. మరోవైపు జనసేన కూడా ఇక్కడ బలం పెంచుకోవడంతో రెండు పార్టీలు కలిసి బరిలో దిగితే మాత్రం నాని పరిస్థితి కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు.

టీడీపీ కూడా..
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేష్ లు నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ లను మట్టి కరిపించాలని ప్రయత్నాల్లో ఉన్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టకూడదని భావిస్తున్నారు. జనసేన రూపంలో స్నేహ హస్తం వస్తే మాత్రం విడిచిపెట్టేందుకు వెనుకాడరు. అందుకే వైసీపీ శ్రేణులను వ్యూహాత్మకంగా .జనసేన గూటికి చేర్చుతున్నారన్న అనుమానాలైతే ఉన్నాయి. గడిచిన ఎన్నికల్లో దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ ను టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. కానీ ఓటమి చవిచూశారు. ఎన్నికలఅనంతరం అవినాష్ వైసీపీ గూటికి చేరారు. వచ్చే ఎన్నికల్లో కొత్త అభ్యర్థిని బరిలో దింపేందుకు టీడీపీ భావిస్తోంది. ఒక వేళ టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే మాత్రం అనూహ్యంగా కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చే అవకాశముంది. క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా రంగంలో దించి ఎట్టి పరిస్థితుల్లో నానిని మట్టికరిపించాలని అటు పవన్, ఇటు చంద్రబాబు ఉండడం భవిష్యత్ లో కొడాలి నానికి సవాళ్లు ఎదురుకానున్నాయి.
Also Read:Early Elections in AP: ఏపీలో ఆరు నెలల ముందే ఎన్నికలు.. సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలు