Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani Drives RTC Bus: జగన్ క్లాస్ బాగా పనిచేసింది.. కొడాలి నానిని బస్సెక్కించింది

Kodali Nani Drives RTC Bus: జగన్ క్లాస్ బాగా పనిచేసింది.. కొడాలి నానిని బస్సెక్కించింది

Kodali Nani Drives RTC Bus
Kodali Nani Drives RTC Bus

Kodali Nani Drives RTC Bus: సీఎం జగన్ తీసుకున్న క్లాస్ తో కొంతమంది ఎమ్మెల్యేలు గాడిలో పడినట్టు కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికలను జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. 175 నియోజకవర్గాలకుగాను 175 గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వెనుకబడిన ఎమ్మెల్యేలకు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ప్రతి 50 రోజులకు వర్క్ షాపులు నిర్వహిస్తూ వెనుకబడిన ఎమ్మెల్యేల జాబితాను చదువుతున్నారు. గడపగడకూ మన ప్రభుత్వ కార్యక్రమ నిర్వహణలో ఆసక్తిచూపని వారిని స్పష్టమైన సంకేతాలిస్తున్నారు. ఇలా అయితే కష్టమని కూడా తేల్చేస్తున్నారు. పనితీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

Also Read: Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న హామీ.. అమ‌లు చేస్తే భ‌విష్య‌త్తులో తిరుగుండ‌దు !

ఇటీవల వర్క్ షాపులో వెనుకబడిన 23 మంది ఎమ్మెల్యేల జాబితాను చదివారు. అందులో గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు. వర్క్ షాపు అనంతరం బయటకు వచ్చిన కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యక్రమాల్లో వెనుకబడిన తనలాంటి నాయకులకు జగన్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారని చెప్పారు. అధినేత మంచి విషయమే చెప్పారన్నారు. తమలాంటి వారు బద్దకం వీడితే మంచిదేనన్నారు. రోజుకు కొద్ది గంటలే పనిచేస్తున్నామని.. దానిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Kodali Nani Drives RTC Bus
Kodali Nani Drives RTC Bus

అయితే కొడాలి నాని వంటి వారి విషయంలో జగన్ ఆ స్థాయిలో క్లాస్ పీకి ఉంటారా అని అందరూ భావించారు. కానీ నాని దూకుడు చూస్తుంటే గట్టిగానే జగన్ హెచ్చరించి ఉంటారన్న అనుమానం కలుగుతోంది. నాని వీలైనంత వరకూ ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వినూత్న కార్యక్రమాలతో ప్రజల మధ్య ఉండేందుకు డిసైడ్ అయ్యారు. గుడివాడ నుంచి 5 ఆర్టీసీ బస్సులను ఆయన ప్రారంభించారు. బస్సును 10 కిలోమీటర్లు స్వయంగా నడిపారు. అచ్చం ప్రొఫెషనల్ డ్రైవర్ నడిపినట్టుగానే.. ట్రాఫిక్ మధ్య కూడా బస్సును సేఫ్ స్థానానికి తీసుకెళ్లి ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి నానా? లేకుంటే డ్రైవర్ నానా? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Also Read:AP Defense Industrial Corridor: ఏపీకి ఢిపెన్స్ కారిడార్ రాదు.. ఎందుకో తెలుసా ?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version