https://oktelugu.com/

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం కేసీఆర్‌‌ కేబినెట్‌ మీట్‌ పెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకటించిన వెంటనే జిల్లాల వారీగా వీఆర్వోల దగ్గర ఉన్న పెండింగ్‌ ఫైల్స్‌ ను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. వెంటవెంటనే తహసీల్దార్లు వాటిని తమ పరిధిలోకి తీసుకొని కలెక్టర్లకు అందజేశారు. వీటితోపాటే ఇంకొన్ని నిర్ణయాలు వెల్లడించారు. Also Read: బ్రేకింగ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 8, 2020 9:21 am
    Follow us on


    మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం కేసీఆర్‌‌ కేబినెట్‌ మీట్‌ పెట్టారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రకటించిన వెంటనే జిల్లాల వారీగా వీఆర్వోల దగ్గర ఉన్న పెండింగ్‌ ఫైల్స్‌ ను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. వెంటవెంటనే తహసీల్దార్లు వాటిని తమ పరిధిలోకి తీసుకొని కలెక్టర్లకు అందజేశారు. వీటితోపాటే ఇంకొన్ని నిర్ణయాలు వెల్లడించారు.

    Also Read: బ్రేకింగ్ : తెలంగాణలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్

    – ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020, ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్–2020ని ఆమోదించింది. దీని ప్రకారం తెలంగాణలో వీఆర్వోను రద్దు చేస్తూ ప్రకటించారు.
    – తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్– గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్.
    – తెలంగాణ  జీఎస్టీ యాక్టు -2017లో సవరణ బిల్లు, తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020, ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020, ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002‌కు కేబినెట్ పచ్చజెండా ఊపింది.
    – ఆయుష్ మెడికల్ కాలేజీల్లో లెక్చరర్ల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్‌ను ఆమోదించింది.
    – టీఎస్ బిపాస్ బిల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    – తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లుతో పాటు ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972కు సవరణ బిల్లును ఆమోదించింది.
    – కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది.

    Also Read: దుబ్బాక టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి అతడేనా?

    – కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది.
    – 17 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ పచ్చజెండా ఊపింది. కేబినెట్ ఆమోదించిన బిల్లులు, ఆర్డినెన్సులను అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున్నారు.