Rythu Runa Mafi: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినందున హామీలు నెరవేర్చడంపై రేవంత్ సర్కార్ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో రుణమాఫీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో కీలక అప్‌డేట్ బయలకు వచ్చింది. ఇందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
అమలు చేయకుంటే..
రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైనది. ఇది అమలు చేయని కారణంగానే గత బీఆర్‌ఎస ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేయకుంటే సర్కార్‌కు ఇబ్బందులు తప్పవు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకే వీలైనంత త్వరగా రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రుణమాఫీపై లక్షల మంది ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల బడ్జెట్‌ప్రసంగంలోనూ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రుణమాఫీ జరుగుందని ప్రకటించారు.
వివరాల సేకరణ షురూ..
ఈ క్రమంలో ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి రైతు రుణమాఫీపై కీలక విషయాన్ని వెల్లడించారు. రైతులకు ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అధికారులు రైతుల రుణాల వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. పూర్తి సమాచారం సేకరించగానే రుణ మాఫీ జరుగుతుందని వెల్లడించారు.
ఇప్పటికే రెండు హామీలు అమలు చేస్తున్న సర్కార్, మరో రెండు హామీలు గృహజ్యోతి, రూ.500లకే గ్యాస్ హామీలు నెరవేర్చేందుకు సిద్ధమైంది. తాజాగా రుణ మాఫీకి కూడా కసరత్తు ప్రారంభించింది.