Homeఆంధ్రప్రదేశ్‌Kethireddy Vs Paritala Sriram: కేతిరెడ్డి వ‌ర్సెస్ ప‌రిటాల‌.. ధ‌ర్మ‌వ‌రంలో ఉద్రిక్త‌త !

Kethireddy Vs Paritala Sriram: కేతిరెడ్డి వ‌ర్సెస్ ప‌రిటాల‌.. ధ‌ర్మ‌వ‌రంలో ఉద్రిక్త‌త !

Kethireddy Vs Paritala Sriram
Kethireddy Vs Paritala Sriram

Kethireddy Vs Paritala Sriram: ప్ర‌శాంత‌మైన ధ‌ర్మ‌వ‌రంలో మాట‌ల య‌ద్ధం మొద‌లైంది. అధికార‌, ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో వాతావ‌ర‌ణం వేడెక్కింది. స‌మాధుల చుట్టూ రాజ‌కీయం తిరుగుతోంది. సున్నిత‌మైన అంశం కావ‌డంతో ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న జ‌నంలో ప్రారంభ‌మైంది. ఇంత‌కీ ధ‌ర్మ‌వ‌రంలో ఏం జ‌రుగుతోంది ? అధికార‌, ప్ర‌తిప‌క్షాల మాట‌ల యుద్ధానికి కార‌ణ‌మేంటి ? స‌్టోరీలో తెలుసుకోండి.

ధ‌ర్మ‌వ‌రం చ‌రిత్ర మొత్తం గాయాల చ‌రిత్రే. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు ఒక‌నాడు పెట్టింది పేరు. వంద‌లాది మంది ఫ్యాక్ష‌న్ కోర‌ల్లో న‌లిగిపోయారు. కాల‌క్ర‌మంలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప్ర‌జ‌లు ఫ్యాక్ష‌న్ కు, ఫ్యాక్ష‌నిస్టుల‌కు దూరం జ‌రిగారు. ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణం నెల‌కొంది. కానీ ఇప్పుడు కొత్త రాజ‌కీయం మొద‌లైంది. స‌మాధుల చుట్టూ రాజ‌కీయం జ‌రుగుతోంది. వైసీపీ, టీడీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో మానుతున్న గాయాల‌ను మ‌ళ్లీ కెలుకుతున్నారు.

ధ‌ర్మ‌వ‌రంలో ముస్లిం ఖ‌బ‌రస్థాన్ లో స‌మాధాల‌ను కొంద‌రు తొల‌గించారు. దీని పై టీడీపీ నేత ప‌రిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డికి తెలియ‌కుండా ఇది జ‌ర‌గ‌లేద‌ని ఆరోపించారు. వెంట‌నే కేతిరెడ్డి స్పందించారు. ముస్లిం మ‌త పెద్ద‌ల నిర్ణ‌యం మేర‌కే ఖ‌బ‌రస్థాన్ లోని స‌మాధుల‌ను తొల‌గించిన‌ట్టు చెప్పారు. త‌న ప్ర‌మేయం ఇందులో లేద‌ని తేల్చిచెప్పారు. అంత‌టితో స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగింద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. తాజాగా కేతిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో స‌మాధుల అంశం పై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్న వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని కోతిరెడ్డి పోలీసుల‌ను కోరారు. ప‌ట్ట‌ణంలోని మ‌సీదు క‌మిటీల‌న్ని క‌లిసి నిర్ణ‌యం తీసుకోవాల‌ని, ఇందులో త‌న ప్ర‌మేయం ఉండ‌ద‌ని ఆయ‌న తేల్చారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. దీనిపై ప‌రిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. గుమ్మ‌డికాయ దొంగ ఎవ‌రంటే.. ఎమ్మెల్యే భుజాలు త‌డుముకుంటున్నార‌ని ప‌రిటాల శ్రీరామ్ ఆరోపించారు. నెల‌రోజుల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న పై ఎమ్మెల్యే ఇప్పుడెందుకు మాట్లాడుతున్నార‌ని ప్ర‌శ్నించారు. స‌మస్య ప‌రిష్కారం అవుతోంద‌నుకున్న స‌మ‌యంలో ఎమ్మెల్యే చిచ్చుపెట్టార‌ని ఆరోపించారు. ఖ‌బ‌రస్థాన్ విష‌యంలో ఎమ్మెల్యే పాత్ర లేకుంటే విజ‌య‌వాడ నుంచి అంత హ‌డావుడిగా ఎందుకొచ్చార‌ని ప్ర‌శ్నించారు.

Kethireddy Vs Paritala Sriram
Kethireddy Vs Paritala Sriram

ఖ‌బ‌ర‌స్థాన్ విష‌యంలో మ‌సీదు క‌మిటీల‌న్నీ క‌లిసి నిర్ణ‌యం తీసుకోవాల‌ని తాను మొద‌టి నుంచి చెబుతున్న‌ట్టు శ్రీరామ్ తెలిపాడు. వైసీపీ ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యం తీసుకుంటే టీడీపీ త‌క్ష‌ణం స్పందిస్తుంద‌ని తెలిపారు. రెండు పార్టీల న‌డుమ ధ‌ర్మ‌వ‌రం ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముస్లిం స‌మాధుల అంశం సున్నితం కావ‌డంతో ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్న భ‌యం ఆవ‌హించింది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌త‌ప‌ర‌మైన అంశాల్లో జోక్యం చేసుకోకుండా .. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జ‌లు కోరుతున్నారు.

 

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Delhi Protests

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...
Bhogapuram Airport

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...
Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper