Kesineni Nani: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. అధినేత బాబు సైతం దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రచారం సాగుతోంది. గత కొద్ది రోజులుగా నేతలు కొందరు పార్టీని వీడాలని చూస్తున్నట్లు సమాచారం. పార్టీ విధానాలతో విభేదించి పార్టీని విడిచిపెట్టేందుకు నిర్ణయించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని గాడిలో పెట్టాల్సిన బాబు నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారుతున్నట్లు ప్రచారం సాగుతోంది. టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీకి పెద్ద నష్టమే జరిగేట్లు కనిపిస్తోంది. విజయవాడ కేంద్రంగా పార్టీని ముందుకు నడిపించే నేతగా నానికి పేరుంది. కానీ బాబు నిర్వాకంతోనే పార్టీ వీడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏకపక్ష నిర్ణయాలతోనే నేతలు విసిగిపోతున్నారు. దీంతో బహిరంగంగా బయటపడకపోయినా లోలోపల మాత్రం అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
కేశినేని నాని బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ గాలి వీయడంతో అందులో చేరేందుకు సమాలోచనలు సాగిస్తున్నట్లు సమాచారం. దీంతో టీడీపీకి లాభం లేకపోగా నష్టమే సంభవించే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాని పార్టీ మార్పుతో టీడీపీ తన ప్రభావాన్ని కోల్పోతుందనే వాదన కార్యకర్తల్లో వస్తోంది. కానీ టీడీపీ నేతలు మాత్రం పట్టించుకోవడం లేదు.
Also Read: Rayalaseema water issues: సీమ నీటి ఫైట్.. జగన్, మోడీని ఢీకొంటారా?
నాని మాత్రం రాజకీయా ల నుంచి తప్పుకుని సమాజ సేవ చేయాలని భావించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాని పార్టీని వీడితే ఆయన మార్గంలో మరికొంత మంది నడవనున్నట్లు చెబుతున్నారు. టీడీపీ అయితే నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందని తెలుస్తోంది. దీంతో టీడీపీ పరిస్థితి ఎటు వైపు పోతుందో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: AP Employees: జీతమో రామచంద్రా.. ఉద్యోగుల్లో వ్యతిరేకత.. జగన్ అధికారాన్ని కూల్చేస్తుందా?