Gruhalakshmi Actress: ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు గృహ లక్ష్మి సీరియల్ ‘తులసి’. కస్తూరి శంకర్ అంటే పెద్దగా ఎవరు గుర్తు పట్టకపోయినా…. ‘తులసి’ పాత్రతో ప్రతి ఇంటికి చేరువైంది. అలా ఈ సీరియల్ తో బాగా పాపులర్ అయ్యింది గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకర్. తన గళం విప్పుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే కస్తూరి శంకర్ తాజాగా తమిళ్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో గురించి ట్విట్టర్ వేదికగా కొన్ని సంచలన నిజాలు బయట పెట్టింది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ అలా అన్ని భాషల్లో ప్రసారమవుతూ, రేటింగ్ పరంగా దూసుకుపోతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్. ఇక గత కొద్ది రోజుల క్రితం తెలుగు లో ఐదో సీజన్ ఘనంగా ప్రారంభమైన సంగతి తెల్సిందే. అయితే దీని తర్వాత తమిళ్ లో కూడా బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మా టీవీ లో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ ఫేమ్ కస్తూరి శంకరన్ ‘తాను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు .. తన లాంటి వారు ఎవరైనా ఉన్నారా అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బోలెడు రియాక్షన్లు వచ్చాయి ఆ ట్వీట్ కి.
ఈ క్రమంలో ఒక నెటిజన్ మీరు నాకు బిగ్ బాస్ లో నచ్చలేదు అంటూ కామెంట్ చేశాడు. దానికి కస్తూరి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చింది తన స్టయిల్లో. అక్కడ ఉన్నది ఉన్నట్టు చూపించాల్సిన అవసరం లేదు, జరిగిన 24 గంటల సంఘటనలని ఒక గంట కి కుదించి, కావాల్సిన మసాలా దట్టించి, ప్రేక్షకులకి నచ్చే రీతిలో ఎపిసోడ్ ఉండేట్టు చూసుకుని ప్రసారం చేస్తారు. మంచిని చెడుగా… చెడుని మంచిగా ఉండేట్టు చూపిస్తూ ఉంటారు. ప్రతి చిన్న గొడవని హైలైట్ చేసి మరి ప్రసారం చేస్తారు. నిజంగా బిగ్ బాస్ ఒక మాయా. దాంట్లో ఏదైనా జరగొచ్చు, ఏమైనా అవ్వొచ్చు. దాన్ని చూసి ఎవ్వరిని జడ్జి చెయ్యకూడదు అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: Manchu Lakshmi: ఈ మంచు లక్ష్మి మళ్లీ పవన్ కళ్యాణ్ ను కలిపేసుకుందే !
తమిళ్ లో ప్రసారమయిన బిగ్ బాస్ సీజన్ 3 లో కస్తూరి శంకరన్ వైల్డ్ కార్డు ఎంట్రీ గా వెళ్లి 63 వ రోజున ఎలిమినేట్ అయ్యి తిరిగి వచ్చింది. అందుకే బిగ్ బాస్ గురించి తన అభిప్రాయాల్ని, తన అనుభవాల్ని, ట్విట్టర్ వేదికగా పంచుకుంది.
Raise your hand if you are like me and haven’t watched a single episode of #BiggBossTamil5 till date. Hugs !
Consolation hugs to those who never managed to watch a single full episode. #StarVijayTV #companyArtists #100naal_velaivaipputhittam
— Kasturi Shankar (@KasthuriShankar) October 16, 2021
Also Read: Ram Charan: నాన్న నట వారసత్వాన్నే కాదు సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నా: రామ్ చరణ్