‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లపై కేరళ మండిపాటు

వలస కూలీలను తరలించడానికి నడుపుతున్న “శ్రామిక్ స్పెషల్” రైళ్ల తీరుతెన్నులపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలపగా తాజాగా కేరళ ప్రభుత్వం కూడా చేరింది. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తమ రాష్ట్రానికి ఆ రైళ్లను పంపడం పట్ల సీఎం పినరాయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ వ్రాసారు. దీనిపై తాజాగా కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా స్పందిస్తూ కరోనా వైరస్ కు కేరళ సూపర్ స్ప్రెడర్ […]

Written By: Neelambaram, Updated On : May 27, 2020 12:10 pm
Follow us on


వలస కూలీలను తరలించడానికి నడుపుతున్న “శ్రామిక్ స్పెషల్” రైళ్ల తీరుతెన్నులపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు తెలపగా తాజాగా కేరళ ప్రభుత్వం కూడా చేరింది. ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా తమ రాష్ట్రానికి ఆ రైళ్లను పంపడం పట్ల సీఎం పినరాయి విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ వ్రాసారు.

దీనిపై తాజాగా కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ కూడా స్పందిస్తూ కరోనా వైరస్ కు కేరళ సూపర్ స్ప్రెడర్ లా మారాలని రైల్వేస్ కోరుకుంటోందని ధ్వజమెత్తారు. ‘గత వారం ముంబై నుంచి ఓ రైలు వచ్చింది. ఆ రైలు జర్నీ ప్రారంభమైన తర్వాతే అది వస్తోందన్న విషయం మాకు తెలిసింది.

పైగా, ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులతో అత్యధికులకు పాస్ లు లేవు. మహమ్మారి చెలరేగుతున్న ఈ రైలులో ఇది అరాచకం. రైల్వేలు కేరళను వైరస్ సూపర్ స్ప్రెడర్ గా చేయాలనుకుంటోంది. అరవడం ఆపి.. బాధ్యతగా ప్రవర్తించండి. కనీసం రైళ్లను ట్రాక్ చేయడానికైనా యత్నంచండి అంటూ ఆయన కేంద్రానికి హితవు చెబుతూ ట్వీట్ చేశారు.

మహారాష్ట్ర నుంచి ఎంత మంది, ఎప్పుడు వస్తున్నారనే దానికి సంబంధించి కనీసం తమకు జాబితే ఇస్తే అందుకు అవసరమైన స్క్రీనింగ్, హోం క్వారంటైన్ లాంటి ఏర్పాట్లను చేసుండే వాళ్లమని సీఎం విజయన్ తెలిపారు. కేరళలో కరోనా కేసుల సంఖ్య 896 గా నమోదైంది. ఇటీవలే మహారాష్ట్ర నుంచి తిరిగొచ్చిన వారిలో 72 మందికి పాజిటివ్ గా తేలింది.

మరోవంక, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సహితం శ్రామిక్ రైళ్ల తీరుపై తప్పుబడుతూ ట్వీట్ చేశారు. కనీసం 40 రైళ్లు తమ గమ్య స్థానానికి కాకుండా 100 కిమీ కు దూరం వెళ్లిపోయాయని పేర్కొన్నారు. చాల రైళ్లు కనీసం 20 గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయని, వాటిల్లో ప్రయాణికులకు ఆహార సదుపాయం కూడా లేదని చెప్పుకొచ్చారు.

రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తమ పార్టీకి నిధుల సేకరణ నుండి రైళ్ల నడవడికపై దృష్టి సారించాలని హితవు చెప్పారు. సొంత ఉరుకు పంపమని అలజడి చేస్తున్న వలస కార్మికులను శిక్షించాలని అనుకొంటున్నారా అంటూ ప్రశ్నించారు.