Keralam Assembly Elections: ప్రజల చేత, ప్రజల కోసం, ప్రజల వల్ల ఎన్నుకున్న నాయకులు పరిపాలిస్తారు. దీనినే ప్రజాస్వామ్యమని అబ్రహం లింకన్ అనే మహాశయుడు కొన్ని దశాబ్దాల క్రితమే సెలవిచ్చాడు. ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పది. ఎందుకంటే ప్రజలకు స్వేచ్ఛ.. తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అధికారం.. ప్రజలకు ఇవ్వడం చాలా గొప్ప విషయం.
Also Read: ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు.. వైసిపి చేసింది అంతకంటే తప్పు
రాను రాను ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం మారిపోతుంది. అధికారం కోసం ప్రజలను ఇబ్బంది పెట్టి.. మభ్యపెట్టి అందళం ఎక్కేవారు అధికమవుతున్నారు. అధికారాన్ని సొంతం చేసుకోవడానికి నేరాలకు.. దారుణాలకు పాల్పడుతున్నారు. అటువంటివారు ప్రతి ఎన్నికల్లో పోటీ చేయడం.. అధికారాన్ని దక్కించుకోవడం పరిపాటిగా మారింది. మనదేశంలో ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలోనూ ఈ తరహా వ్యక్తులు పోటీ చేస్తున్నారు. అందులో కొందరు విజయం సాధించి చట్టసభలకు వెళుతున్నారు. ఇటువంటివారు గెలిచిన తర్వాత.. ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉంటారు.. ప్రజల సమస్యలు ఏ స్థాయిలో పరిష్కరిస్తారు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించదు…
ప్రస్తుతం కేరళ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే అక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారు వెల్లడించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ అనే సంస్థ క్రోడీకరించింది. ఈ సందర్భంగా కీలక విషయాలను బయటపెట్టింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో 38 శాతం మంది క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నారు. ఇందులో 23 శాతం మంది తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రధాన పార్టీలపరంగా చూస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థులలో 85 మంది పోటీలో ఉంటే అందులో 72 మంది, బిజెపి అభ్యర్థులు 93 మంది పోటీలో ఉంటే అందులో 59 మంది, సిపిఎం అభ్యర్థులు 77 మంది పోటీలో ఉంటే 51 మంది క్రిమినల్ కేసులు, తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
డెమొక్రటిక్ ఫోరం రెడ్ అలర్ట్ నియోజకవర్గాలను కూడా వెల్లడించింది. 140 నియోజకవర్గాలలో 59 స్థానాలలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు తనమీద క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు. మొత్తం 883 మంది అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో.. 863 మంది అభ్యర్థుల సమాచారాన్ని ఏడిఆర్ విశ్లేషించింది. ఎంతమంది అభ్యర్థులు అసంపూర్ణమైన అఫీడవిట్ దాఖలు చేయడం వల్ల వారి వివరాలు తెలియ రాలేదు. కేరళ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 70 శాతం మంది తమపై ఉన్న క్రిమినల్ కేసులను స్వయంగా వెల్లడించారు. కేరళ రాష్ట్రంలో ఏప్రిల్ 9న ఎన్నికలు జరగబోతున్నాయి. మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.