https://oktelugu.com/

Arvind Kejriwal: ‘కశ్మీర్ పండింట్లను వాడుకొని దర్శకుడు కోట్లు సంపాదించాడు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

Arvind Kejriwal: మొన్నటి వరకూ కనీసం ఎవరికీ పరిచయం లేని ఆ సినిమా పేరు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ మూవీపై ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో.. అన్నే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మూవీ టీంను పిలిచి మరీ అభినందించడంతో ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సినిమాకు అక్కడి ప్రభుత్వాలు బాగా సహకరిస్తున్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈ మూవీపై టాక్స్ ను […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 25, 2022 / 03:18 PM IST
    Follow us on

    Arvind Kejriwal: మొన్నటి వరకూ కనీసం ఎవరికీ పరిచయం లేని ఆ సినిమా పేరు.. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ మూవీపై ఎన్ని ప్రశంసలు వస్తున్నాయో.. అన్నే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ మూవీ టీంను పిలిచి మరీ అభినందించడంతో ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. పైగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ సినిమాకు అక్కడి ప్రభుత్వాలు బాగా సహకరిస్తున్నాయి.

    Arvind Kejriwal

    మధ్యప్రదేశ్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో ఈ మూవీపై టాక్స్ ను మినహాయించారు. పైగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూవీని చూడటం కోసం పోలీసులకు ఒక రోజు స్పెషల్ లీవ్ కూడా కేటాయించారు. దీంతో ఈ మూవీపై ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. కాగా దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఈ మూవీ చర్చనీయాంశంగా మారింది.

    Also Read:  ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరోలు, ప్రముఖులు ఏమన్నారంటే?

    బీజీపీ దాని అనుకూల పార్టీలు ఈ మూవీపై ప్రశంసలు కురిపించగా.. కేసీఆర్ లాంటి వారు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. ఈ సినిమాను రాజకీయ ప్రయోజనం కోసమే తెరకెక్కించారని.. దీని వెనకాల బీజేపీ కుట్ర దాగుందని మొన్న కేసీఆర్ మీడియా సాక్షిగా నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ మూవీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.

    The Kashmir Files

    అసెంబ్లీ సమావేశంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఈ మూవీపై అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు చర్చకు తీసుకువచ్చారు. ఈ మూవీకి ఢిల్లీలో టాక్స్ మినహాయించాలంటూ వారు చేసిన విజ్ఞప్తిపై కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. ఈ మూవీతో ఆ డైరెక్టర్ కోట్లు సంపాదించుకున్నారని.. కాశ్మీర్ పండిట్ల పేరుతో డబ్బులు దండుకుంటున్నార‌ని, కావాలంటే ఆ సినిమాను డైరెక్టర్ యూట్యూబ్ లో పెడితే అందరు ఫ్రీగా చూడొచ్చు కదా అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    Also Read:  బాబుకు కొత్త తలనొప్పి..: అభ్యర్థుల మార్పు అసలుకే మోసం..?

     

    Recommended Video:

    Tags