https://oktelugu.com/

KCR Press Meet : ప్రెస్ మీట్ కు ముందే బీజేపీ సెకండ్ షో చూపిస్తానంటూ షాకిచ్చిన కేసీఆర్

KCR Press Meet :  మునుగోడు ఉప ఎన్నిక ముగియడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రాత్రి 8 గంటలకు సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యమైన అంశం ఏంటంటే.. మునుగోడు ఉప ఎన్నికల వేళ కొనుగోలులో కీలక పాత్ర పోషించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పక్కన కూర్చుండబెట్టుకొని కేసీఆర్ ప్రెస్ మీట్ మొదలుపెట్టారు. ఎన్నడూ లేనిది తన ప్రెస్ మీట్ వెనుక భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేసి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 3, 2022 / 08:22 PM IST
    Follow us on

    KCR Press Meet :  మునుగోడు ఉప ఎన్నిక ముగియడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ రాత్రి 8 గంటలకు సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో ముఖ్యమైన అంశం ఏంటంటే.. మునుగోడు ఉప ఎన్నికల వేళ కొనుగోలులో కీలక పాత్ర పోషించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పక్కన కూర్చుండబెట్టుకొని కేసీఆర్ ప్రెస్ మీట్ మొదలుపెట్టారు. ఎన్నడూ లేనిది తన ప్రెస్ మీట్ వెనుక భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేసి గంట సేపు బీజేపీ అక్రమాలను అందులో చూపిస్తానంటూ సంచలన విషయాలు చెప్పారు..

    నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో దొరికిన సాక్ష్యాలను ఈ ప్రెస్ మీట్ లో బయటపెడుతన్నానని.. మునుగోడు ఎన్నికల కోసమే తాను ఇన్ని రోజులు ఆగానని కేసీఆర్ బాంబు పేల్చారు. గంటసేపు మీరు టీవీలో కొనుగోళ్ల వ్యవహారం.. బీజేపీ పెద్దల బాగోతాలు చూస్తారని.. అందుకే ఈరోజు మీకు లంచ్ ఏర్పాటు చేసినట్టు కేసీఆర్ విలేకరులకు ముందే చెప్పారు.

    ప్రెస్ మీట్ కు ముందే బీజేపీ సెకండ్ షో చూపిస్తానంటూ చెప్పిన కేసీఆర్ అన్నట్టే ప్రెస్ మీట్ మొదలు పెట్టారు. ముందు తెలుగులో మాట్లాడిన కేసీఆర్ .. ఆ తర్వాత హిందీలో ప్రెస్ మీట్ పెట్టారు.

    ఇక ఈ సాక్ష్యాలను అన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లకు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పార్టీలకు పంపిస్తానని.. న్యాయం కోసం ఇదంతా చేస్తున్నానని.. దేశ ప్రజాస్వామ్యంలో బాధ్యులైన వ్యక్తులు ఇది తెలుసుకోవాలని కేసీఆర్ సూచించారు. మరి కేసీఆర్ ఏం చూపించబోతున్నాడు? ఏంటి కథ అన్నది ప్రెస్ మీట్ లో వివరించారు.