KCR- National Party: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. కొద్ది రోజులుగా బీజేపైపై కోపంతో మూడో కూటమి ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. దీనికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తిరిగి నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పర్యటించి స్టాలిన్, విజయన్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ లాంటి వారిని కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. బీజేపీయేతర ప్రభుత్వం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని కొద్ది రోజులుగా శ్రమిస్తున్నారు.

అక్టోబర్ 5 దసరా సందర్భంగా కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీ ప్రకటిస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. అయితే కొన్ని కారణాల వల్ల పార్టీ ప్రకటన డిసెంబర్ లో ఉంటుందని వార్తలు వచ్చినా ప్రస్తుతం దసరా రోజునే ముహూర్తంగా చేసుకుంటున్నారని చెబుతున్నారు. దీంతో మూడో కూటమి ప్రయత్నాలు వేగవంతం చేసి రాబోయే ఎన్నికలకు సన్నద్ధం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
Also Read: CM Jagan- MLAs: ఆ 27 మందికి సీఎం జగన్ క్లాస్… జాబితాలో మంత్రులు, తాజా మాజీలే అధికం
అక్టోబర్ 5న ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీ గురించి నేడు మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎల్వీ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. దీనికి సంబంధిన విధివిధానాలు ఖరారు చేయనున్నారు. పార్టీ కో ఆర్డినేటర్లను ప్రకటించనున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి పలువురు నేతలకు ఆహ్వానం పంపే విషయాలపై కూలకషంగా చర్చించనున్నారు. ఇప్పటికే కేసీఆర్ అందరికి మార్గనిర్దేశం చేశారు. పార్టీ ఏర్పాటు గురించి జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్నారు. ఇందుకోసమే సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

జాతీయ స్థాయి రాజకీయాల కోసం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దీనికి పలువురు నేతలను కలిసి తన ఉద్దేశాలను వివరించారు. బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం సమకూర్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీని బంగాళాఖాతంలో కలపాలని పదేపదే చెబుతున్నారు. దసరా ముహూర్తంలో కేసీఆర్ జాతీయ పార్టీ ఆవిర్భావ ప్రకటన చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళిక రెడీ చేసుకున్నారు. దీనికి ఏం చేయబోతున్నారనే దానిపై ఓ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.
జాతీయ రాజకీయాల్లో రాణించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత కేసీఆర్ తీరులో మార్పు వచ్చింది. బీజేపీని టార్గెట్ చేసుకున్నారు. జాతీయ స్థాయిలో పార్టీని స్థాపించి బీజేపీని అధికారానికి దూరం చేయాలని నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే దానికి సంబధించిన ప్రణాళికలు రెడీ చేసుకున్నారు.
Also Read: Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజీనామా అస్త్రం.. పొలిటికల్ సర్కిల్ లో సంచలనం