Homeజాతీయ వార్తలుKCR BRS: తెలంగాణలో రాచరికం.. అదే బీఆర్‌ఎస్‌కు ముప్పు!

KCR BRS: తెలంగాణలో రాచరికం.. అదే బీఆర్‌ఎస్‌కు ముప్పు!

KCR BRS
KCR BRS

KCR BRS: ‘వాడుపోతే వీడు.. వీడుపోతే వీడమ్మా మొగుడు అంటూ అంటూ ఎవరైనా వస్తే..’ ఇదీ ఛత్రపతి సినిమాలో వారసత్వ రౌడీయిజం గురించి ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌. రౌడీయిజాని నేటి రాజకీయాలు ఏమాత్రం తీసిపోవడం లేదు. మంచి సిద్దాంతంతో పార్టీ పెట్టామని, కొత్త ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చామని, రాజకీయాల్లోల అవినీతి, గూండాయిజాన్ని ప్రక్షాళన చేసేందుకు వచ్చామని పుట్టుకొస్తున్న పార్టీలు తర్వాత వారసత్వ పార్టీలుగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చే వరకు మంచిగా నటిస్తూ.. అధికారంలోకి రాగానే కొడుకు, బిడ్డ, అల్లుడు, తోడళ్లుడు, తమ్ముడి కొడుకు, అన్న కొడుకు అంటూ అందర్నీ రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. తన తర్వాత తన కొడుకు, లేదా కూతురుకు పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారు.

Also Read: Uttarandhra TDP: ఉత్తరాంధ్రలో టీడీపీని గాడిలోపెట్టే పనిలో చంద్రబాబు.. ఆ నేతలకు సీరియస్ వార్నింగ్

తెలంగాణలో రాజరికం..
తెలంగాణలో ఎనిమిదేళ్లుగా ఎవరు అవున్నా.. కాదన్నా నిజాం రాచరికాన్ని తలపించే పాలన సాగుతోంది. మేధావులు సైతం దీనిని అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్‌ ఆయన తర్వాత కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావు, కూతురు కవిత మాత్రమే పాలన సాగిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వంలో మంత్రులు ఉన్నా.. వారు ఉత్సవ విగ్రహాలే. సీఎం కేసీఆర్‌ అయితే.. కొడుకు కేటీఆర్‌కు మంత్రి పదవితోపాటు, పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఇక తెలంగాణ ప్రభుత్వంలో మాట్లాడే స్వేచ్ఛ, సొంతగా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా కేటీఆర్, హరీశ్‌ రావుకు మాత్రమే ఉన్నాయి. కవితకు పదవి లేకపోయినా ఆమె మంత్రులను, అధికారులను ఆదేశిస్తారు. వారు ఆచరిస్తారు. ఇలా రాజరికానికి ఏమాత్రం తీసిపోకుండా సాగుతోంది తెలంగాణలో ప్రభుత్వ పాలన.

ఓడిపోయిన ఏడాదికే కూతురుకు పదవి..
2019 లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ కుమార్తె కవిత బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆమె ఏడాదిపాటు ఎలాంటి పదవి లేకుండా ఉండిపోయింది. తన కూతరుకు పదవి లేకపోవడంతో నొచ్చుకున్న కేసీఆర్‌ వెంటనే ఆమెను ఎమ్మెల్సీ చేసేశారు. మంత్రి పదవి కూడా ఇస్తారని ప్రచారం జరిగినా, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. పదవి లేకపోతేనేం.. ఆమె మంత్రికి ఏమాత్రం తక్కువ కాకుండా అధికారాలు చెలాయిస్తుంది. ఏకంగా ఢిల్లీ ప్రభుత్వంలో లిక్కర్‌ పాలసీలో సౌత్‌ గ్రూప్‌ను లీడ్‌చేసిందంటే ఆమెకు ఎంత అధికారం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కరీంనగర్‌ లోక్‌సభ నుంచి పోటీచేసిన కేసీఆర్‌ బంధువు బోయినపల్లిల వినోద్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేతిలో ఓడిపోయారు. ఆయను కూడా ఖాళీగా ఉంచకుండా ప్రణాళికా సంఘం ఏర్పాటు చేసి దానికి ఉపాధ్యక్షుడిని చేసి కేబినెట్‌ హోదా కల్పించారు.

కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అతీకం కాదు..
జాతీయ పార్టీ కాంగ్రెస్‌తోపాటు, ప్రాంతీయ పార్టీలు టీడీపీ, వైసీపీలు కూడా రాచరిక పాలనకు ఏమాత్రం అతీతం కాదు. ఈ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా సోనియాగాంధీ, చంద్రబాబునాయుడు, రాజశేఖరరెడ్డి, ప్రస్తుతం జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఏకచత్రాధిపత్యం సాగిస్తున్నారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడంతో అన్నీ తామే అయి వ్యవహరిస్తున్నారు. అయితే తెలంగాణలో ఇది శృతి మించింది.

KCR BRS
KCR BRS

ప్రజల్లో ప్రక్షాళన..
రాచరిక పాలనతో విసిగిపోయిన ప్రజలే ఇప్పుడు ప్రక్షాళన గురించి ఆలోచిస్తున్నారు. రాజకీయాలను, అవినీతిని ప్రక్షాళన చేస్తామని అధికారంలోకి వస్తున్న నేతలు తర్వాత తామే రాజులమనేలా పాలన సాగిస్తున్నారు. అలాంటప్పుడు రాజులు, నిజాం పాలనే మేలన్న భావన తెలంగాణ ప్రజల్లో పెరుగుతోంది. దీంతో ప్రజలు తామే మొదల ప్రక్షాళన కావాలన్న భావన ఏర్పడుతోంది. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఇదే తెలంగాణలో ముప్పుగా మారబోతుందని మేధావులు భావిస్తున్నారు.

Also Read: YCP: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ పరిస్థితేంటంటే?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version