రైతులకు సీఎం చెప్పే తీపి కబురు ఇదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టిన సంగతి తెల్సిందే. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ రైతులనుద్దేశించి మాట్లాడారు. త్వరలోనే దేశం మొత్తం వీస్తుపోయేలా రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నన్నట్లు ప్రకటించారు. దీంతో కేసీఆర్ చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటనే ఆసక్తి రైతుల్లో నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలకు ప్రవేశపెట్టింది. రైతుబంధు […]

Written By: Neelambaram, Updated On : May 30, 2020 12:37 pm
Follow us on


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానంటూ సస్పెన్స్ లో పెట్టిన సంగతి తెల్సిందే. కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ రైతులనుద్దేశించి మాట్లాడారు. త్వరలోనే దేశం మొత్తం వీస్తుపోయేలా రైతులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నన్నట్లు ప్రకటించారు. దీంతో కేసీఆర్ చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటనే ఆసక్తి రైతుల్లో నెలకొంది. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, 24గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలకు ప్రవేశపెట్టింది. రైతుబంధు కింద ప్రతీ ఎకరానికి ఏడాదికి 10వేల పెట్టుబడిని రైతులకు అందజేస్తోంది. ఈ పథకం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఇలాంటి పథకమే కేసీఆర్ త్వరలో ప్రవేశపెట్టబోతున్నారని రైతులు చర్చించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రం వరిసాగులో గణనీయమైన దిగుబడి సాధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ప్రకటించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పంటలకు సాగునీరు కూడా పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ తెలంగాణలో నియంత్రిత పంటల సాగుపై దృష్టి సారించారు. రైతులకు ఏయే పంటలు వేయాలనేది కూడా వ్యవసాయాధికారులు సూచించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు కూడా రూపొందించింది. ఈమేరకు ప్రభుత్వం చెప్పిన పంటలు వేసే రైతులకు ప్రోత్సాహాకాలను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందని చర్చ జరుగుతుంది.

రైతులకు ఉచితంగా ఎరువులు అందించడం, పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయడం, మద్దతు ధర కల్పించడం, బోనస్ ఇవ్వడం లాంటి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఉండొచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకొని రైతులకు ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని సమాచారం. ఏదిఏమైనా తెలంగాణలో ఎక్కడా చూసిన కేసీఆర్ చెప్పబోయే గుడ్ న్యూస్ గురించే చర్చ జరుగుతుండటం విశేషం.