KCR: రోజురోజుకు బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయాలు మారుతున్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో టీఆర్ఎస్ బీజేపీపై కావాలనే దురుద్దేశంతో పోరాటానికి దిగుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన పాదయాత్రలకు అడ్డు చెప్పని టీఆర్ఎస్ నేతలు హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత ఆయనపై కావాలనే దాడి చేసేందుకు వ్యూహం పన్నినట్లు భోగట్టా. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో పెనుమార్పుల చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.

సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్రం వైఖరి ఏమిటనే దానిపై ప్రధానితో చర్చించి తేల్చుకోవాలని ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడే మకాం వేసి ప్రధానితో అపాయింట్ మెంట్ తీసుకుని కలుసుకుని ధాన్యం కొనుగోళ్లలో ఉన్న సమస్యలను ఏకరువు పెట్టి తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సీఎం వెంట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ ఉండనున్నారు.
ధాన్యం కొనుగోలుపై క్లారిటీ వచ్చే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని చెబుతున్నారు. ఈ సారి మాత్రం కేంద్రం వైఖరి ఏంటో స్పష్టంగా ఉండాలన్నదే కేసీఆర్ ఉద్దేశం. దీని కోసమే సీఎం ప్రధానితో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని తో పాటు మంత్రులను కూడా కలుసుకుని పలు సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: Chandrababu: చంద్రబాబు పరువు ఎవరు తీస్తున్నారు..?
యాసంగిలో వరి సాగుపై ఇప్పటికే స్పష్టత రావడం లేదు. దీంతో బీజేపీ నేతలు ఓ మాట రాష్ర్ట నేతలు మరో మాట చెబుతుండటంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. దీంతో వారికి ఎలాంటి సందేహాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రయత్నిస్తుట్లు చెబుతున్నారు. ఢిల్లీ పర్యటన తరువాత తెలంగాణ రైతాంగానికి వివరణ ఇచ్చే వీలుంటుందని తెలుస్తోంది.
Also Read: KCR Jagan: కలిసిన కేసీఆర్, జగన్..చంద్రబాబు సింపతిపై కీలక సమాలోచనలు?