Homeజాతీయ వార్తలుKCR Views: పద్మవ్యూహంలో కేసీఆర్‌.. రాష్ట్రపతి ఎన్నికల వేళ ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!!

KCR Views: పద్మవ్యూహంలో కేసీఆర్‌.. రాష్ట్రపతి ఎన్నికల వేళ ముందు నుయ్యి.. వెనుక గొయ్యి!!

KCR Views: రాష్ట్రపతి ఎన్నికలు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు అగ్నిపరీక్ష పెట్టబోతున్నాయి. కేంద్రంతో ఏడాదిగా ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్‌.. రాష పతి ఎన్నికల వేళ వ్యూహాత్మకంగా ప్రధానిని దెబ్బకొట్టాలనుకూన్న కేసీఆర్‌ ఇప్పుడు తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డారు. పూర్తిగా రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారు. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిని ఇరకాటంలో పడేసేలా నిజంగా కేసీఆర్‌ బీజేపీ వ్యతిరేక స్టాండ్‌ తీసుకుటే రాష్ట్రపతి ఎన్నిల్లో అభ్యర్థిని నిలబెట్టాలని సవాల్‌ విసిరారు. దీంతో కేసీఆర్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది.

KCR Views
KCR

రాజకీయ లబ్ధి కోసం రేవంత్‌ సవాల్‌..

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు కొత్తకాదు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు తెలంగాణ మంత్రలు చాలా సందర్భాల్లో సవాళ్లు విసిరారు. ప్రధాని మోదీనే చాలెంజ్‌ చేశారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికల వేళ టీపీసీసీ అధ్యక్షుడు రేంత్‌రెడ్డి రాజకీయ లబ్ధి కోసం సీఎం కేసీఆర్‌ను ఇరకాటంలో పెట్టే సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీతో ఎలాంటి అవగాహన లేకుంటే.. పూర్తిగా బీజేపీ వ్యతిరేక స్టాండ్‌ తీసుకుంటే కేసీఆర్‌ సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని సవాల్‌ చేశారు.

KCR Views
Revanth Reddy

డైలమాలో టీఆర్‌ఎస్‌..

రాష్ట్రపతి ఎన్నికల విషయంలో టీఆర్‌ఎస్‌ పూర్తి డైలామాలో ఉంది. బీజేపీ వ్యతిరేక స్టాండ్‌ తీసుకున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశాలు లేవు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మరి ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేది ఇప్పుడు ప్రశ్న. బీజేపీకి వ్యతిరేకంగా నిలబడే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి. మరి బీజేపీ వ్యతిరేక అభ్యర్థి ఎవరంటే సహజంగా వచ్చేది కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు నిలబెట్టే అభ్యర్థి. కాంగ్రెస్‌కు కూడా సమాన దూరం పాటిస్తామని, ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందుకు వెళ్తున్నానని చెబుతున్న కేసీఆర్‌ కాంగ్రెస్‌ నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశంపైనే ఇప్పుడు సందిగ్ధం నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతు లేకుండా విపక్ష అభ్యర్థి పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పటికే కాంగ్రెస్‌ మిత్రపక్షాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని నిలబెట్టినా కాంగ్రెస్‌ మద్దతు లేకుండా గెలవడం అసాధ్యం. అనివార్యంగా కాంగ్రెస్‌ తన మిత్రపక్షాలతో కలిసి నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇదే జరిగితే బీజేపీకి మరో ఆయుధం దొరికినట్లే. తాము మొదటి నుంచి చెబుతున్నట్లు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఒక్కటే అని బీజేపీ ప్రచారం చేస్తుంది.

Also Read: Nayanthara: తిరుమలలో భద్రతా వైఫల్యం…శ్రీవారి ఆలయం ముందుకు చెప్పులతో వచ్చిన నయనతార

సొంతంగా అభ్యర్థిని నిలబెట్టే చాన్స్‌ లేదు..

కాంగ్రెస్‌ బీజేపీకి ప్రత్యామ్నాయంగా దేశంలో కూటమి ఏర్పాటు చేస్తామని చెబుతున్న కేసీఆర్‌ ఒకవేళ సొంతంగా అభ్యర్థిని నిలబెట్టే అవకాశం దాదాపు లేదు. ఎందుకంటే ఆయన తన మిత్రులు అనుకుంటున్న ఎన్‌సీపీ, శివసేన, జేడీయూ, తృణమోల్‌ కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీలు కేసీఆర్‌ కంటే ముందు నుంచే కాంగ్రెస్‌తో సన్నిహతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సొంతంగా అభ్యర్థిని నిలబెట్టినా… ఆయన మిత్రపక్షాలుగా చెప్పుకేనే పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేసే అవకాశం లేదు. ఇక కేసీఆర్‌ సొంతంగా రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడితే.. కాంగ్రెస్‌కు ఆయుధం ఇచ్చినట్లవుతుంది. బీజేపీకి మద్దతు ఇవ్వడానికే, విపక్ష ఓట్లు చీల్చి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికే కేసీఆర్‌ అభ్యర్థిని నిలబెట్టారని కాంగ్రెస్‌తోపాటు, యూపీయే మిత్రపక్షాలు ఆరోపణలు చేసే అవకాశం ఉంది. కేసీఆర్‌ వెనుక ప్రధాని మోదీ ఉన్నారనే ప్రచారం కూడా చేసే అవకాశం ఉంది.

అగ్ని పరీక్షే..

ఇక బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఎవరికీ మద్దతు ఇవ్వకుంటే టీఆర్‌ఎస్‌ తటస్థంగా ఉండాలి. ఇది కూడా టీఆర్‌ఎస్‌కు తలనొప్పే. ఇన్ని రోజులూ బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త పర్యటన చేసిన కేసీఆర్‌ కాంగ్రెస్‌ మిత్రపక్షాలను కూడా చీల్చే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. దీంతో కాంగ్రెస్‌ కేసీఆర్‌ను టార్గెట్‌ చేయవచ్చు. తటస్థంగా ఉండడం వలన బీజేపీకి మద్దతు ఇచ్చారన్న ఆరోపణలు వస్తాయి. బీజేపీపై కేసీఆర్‌ పోరాటం అంతా వట్టిదే అనే విమర్శలు వినిపిస్తాయి. కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే బీజేపీ టార్గెట్‌ చేస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల పద్మవ్యూహం నుంచి ఇప్పుడు కేసీఆర్‌ ఎలా బయటపడతారు అనేది చూడాలి. ఇది కేసీఆర్‌ రాజకీయ చతురతకు పరీక్షే..!!

Also Read: Hyderabad Pubs: హైదరాబాద్ కు ‘పబ్బు‘ గబ్బు

RELATED ARTICLES

Most Popular