Monsoon: నైరుతి రుతుపవనాలు ఈసారి ఆలస్యం చేస్తున్నాయి. జూన్ లోనే రాష్ట్రమంతటా విస్తరించి వర్షాలు జోరుగా కురిసే తొలకరి ఈ దఫా ఎందుకో తటపటాయిస్తోంది. దీంతో రైతులు వానల కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. తొలకరి కురిస్తేనే సాగుకు సమాయత్తం అవుతారు. అందుకే ఎప్పుడు వర్షాలు పడతాయనే కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. మన దేశం వ్యవసాయాధారిత దేశం కావడంతో వర్షాలే మనకు ప్రధాన నీటి వనరుగా ఉంటున్నాయి. దీంతో వర్షాలు పడితేనే సాగు పనులు ముందుకు సాగేది. అందుకే రైతులు వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు.

కానీ ప్రకృతి మాత్రం కనికరించడం లేదు. రుతుపవనాలు చురుగ్గా కదలడం లేదు. ఫలితంగా రాష్ట్రానికి రుతుపవనాల రాక 14 తరువాతే అని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. దీంతో రైతులకు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. సాగు మరింత ఆలస్యమవుతుందని కంగారు పడుతున్నారు. సరైన సమయంలో వర్షాలు పడితేనే పంటలు కూడా సమృద్ధిగా పండుతాయని తెలిసిందే. దీంతో ఈసారి వర్షాలు మరింత ఆలస్యం చేస్తూ రైతులను కంగారు పెడుతున్నాయి.
Also Read: AP Political Parties: జనాల్లోకి ఏపీ రాజకీయ పార్టీలు.. ప్లాన్ఏంటి?
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలు ఈనెల 14 వరకు ఉంటాయని తెలుస్తోంది. దీంతో రుతుపవనాల ఆలస్యంగా రావడానికి బంగాళాఖాతంలో ఏర్పడే పరిస్థితులే కారణమని చెబుతున్నారు. జూన్ రెండో వారంలో ఉన్నా ఎండలు ఇంకా ఎక్కువగానే ఉంటున్నాయి. దీంతో రైతుల కళ్లల్లో నిరాశే కనిపిస్తోంది. రుతుపవనాల రాక ఇంకా ఆలస్యమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.

అదను దాటితే వ్యవసాయం అంతగా పనికి రాదు. అందుకే సమయానికి విత్తనాలు పడితేనే పంట దిగుబడి బాగా వస్తుంది. రైతుకు మేలు జరుగుతుంది. కానీ ఈ సారి రైతులకు నష్టమే కలిగేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈనెల 14 తరువాతే వానలపై ఓ స్పష్టత వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో రుతుపవనాల జాడ ఇకనైనా కనిపిస్తుందా అని అన్నదాతలు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.
Also Read: Himba Tribe: హింబా తెగ: జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారు.. ఎందుకో తెలుసా?
[…] Also Read: Monsoon: రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఎందుక… […]