Homeజాతీయ వార్తలుKCR BRS: బీఆర్ఎస్ లక్ష్యాలివే.. బీజేపీకి షాకిచ్చే నిర్ణయాలు ప్రకటించిన కేసీఆర్

KCR BRS: బీఆర్ఎస్ లక్ష్యాలివే.. బీజేపీకి షాకిచ్చే నిర్ణయాలు ప్రకటించిన కేసీఆర్

KCR BRS: విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ఆపేస్తాం. సైన్యంలో పాత ప‌ద్ధ‌తిలో నియామ‌కాలు చేప‌డ‌తాం. భార‌త్ ను ప్ర‌పంచానికి ఫుడ్ చైన్ గా మారుస్తాం. ఎల్ఐసీకి అండ‌గా ఉంటాం. దేశం మార్పు కోరుతోంది. ఇంత‌సేపు కూర్చున్న మీ స‌హ‌న‌మే అందుకు నిద‌ర్శ‌నం. బీఆర్ఎస్ ల‌క్ష్యం ఇదే. వెలుగు జిలుగుల భార‌త్ సాధ‌నే బీఆర్ఎస్ ల‌క్ష్యమ‌ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్ల‌డించారు. దేశంలో గుణాత్మ‌క మార్పుకు బీఆర్ఎస్ ప‌ని చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

KCR BRS
KCR BRS

ఖ‌మ్మం స‌భ వేదిక‌గా కేసీఆర్ బీఆర్ఎస్ ల‌క్ష్యాల‌ను వెల్ల‌డించారు. బీజేపీ విధానాల‌ను దుయ్య‌బ‌ట్టారు. కేసీఆర్ మాట‌ల‌తో స‌భికుల్ని ఉర్రూత‌లూగించారు. వినూత్న‌మైన హామీల‌తో బీజేపీకి షాక్ ఇచ్చే నిర్ణ‌యాలు ప్ర‌క‌టించారు. ఖ‌మ్మం చ‌రిత్రలో ఇలాంటి స‌భ ఎన్న‌డూ జ‌ర‌గ‌లేద‌ని కేసీఆర్ తెలిపారు. 150 మంది మేధావుల‌తో బీఆర్ఎస్ విధివిధానాల్ని రూపొందిస్తోంద‌ని కేసీఆర్ వెల్ల‌డించారు.

ప్ర‌పంచానికి ఫుడ్ చైన్ గా మారాల్సిన దేశం.. పిజ్జాలు, బ‌ర్గ‌ర్లు తింటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలోని నీటి వ‌న‌రులు, విశాల‌మైన వ్య‌వ‌సాయ భూమిని ఉప‌యోగించి బ్ర‌హ్మాండ‌మైన పంటలు పండించ‌వ‌చ్చ‌న్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మను అభివృద్ధి చేసి ప్ర‌పంచానికే ఫుడ్ చైన్ గా మార్చుతామ‌ని వెల్ల‌డించారు. దేశంలో ఉన్న 70 వేల టీఎంసీల నీటిని వినియోగించుకుని, రాష్ట్రాల మ‌ధ్య జ‌ల‌వివాదాలు లేకుండా చేస్తామ‌న్నారు. చైనాలో యాంగ్జీ న‌ది పై 5 వేల టీఎంసీల ప్రాజెక్టు ఉంద‌ని, అలాంటి ప్రాజెక్టు భార‌త్ లో నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. భార‌త్ లోని విశాల‌మైన భూభాగాన్ని స‌స్య‌శ్యామలం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

KCR BRS
KCR BRS

మిగులు విద్యుత్ తో రైతుల‌కు ఉచిత విద్యుత్ ఇస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. త‌ద్వార దేశంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు నివారిస్తామ‌ని వెల్ల‌డించారు. ఉచిత విద్యుత్ ఇస్తే కేవ‌లం రూ. 2 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు అవుతాయ‌ని, మోదీ ప్ర‌భుత్వం కార్పొరేట్ల‌కు రూ. 14 ల‌క్ష‌ల కోట్లు ఎన్పీఏల పేరుతో దోచిపెట్టింద‌న్నారు. న‌ష్టాలు స‌మాజానికి, లాభాలు ప్రైవేటు వ్య‌క్తుల‌కు అన్న పాల‌సీతో మోదీ ప్ర‌భుత్వం న‌డుస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌భుత్వ రంగంలోని ఎల్ఐసీ అమ్మ‌కాన్ని అడ్డుకుంటామ‌ని తేల్చి చెప్పారు. ఎల్ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బీఆర్ఎస్ తో క‌లిసి రావాల‌ని, పిడికిలి బిగించి పోరాడాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో ప్ర‌భుత్వ సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ అడ్డుకుంటామ‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు.

వ్యాపారాల నుంచి మోదీ ప్ర‌భుత్వం దూరం జ‌రిగితే.. అవ‌స‌రం మేర‌కు వ్యాపారం చేయ‌డం త‌మ విధాన‌మ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వానికి వ‌చ్చే లాభాల‌తో పేద‌ల‌కు స‌బ్సీడీకే అన్ని వ‌స‌తులు క‌ల్పించ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. అగ్నిప‌థ్ స్థానంలో పాత ప‌ద్ధ‌తిలో నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ర‌ద్దు చేస్తామ‌ని చెప్పారు. మోదీ అమ్మితే.. అధికారంలోకి వ‌చ్చాక తాము కొంటామ‌ని హామీ ఇచ్చారు. దేశంలో మేడిన్ ఇండియా .. జోక్ ఇన్ ఇండియాగా మారింద‌ని ఎద్దేవా చేశారు.

బీజేపీ టార్గెట్ గా ఖ‌మ్మం స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగం సాగింది. మోదీ విధానాల‌ను దుయ్య‌బ‌డుతూనే.. తాము అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తామో కేసీఆర్ వెల్ల‌డించారు. త్వ‌ర‌లో పూర్తీ స్థాయి విధివిధానాల్ని ప్ర‌క‌టిస్తామ‌ని తెలిపారు. మోదీది ప్రైవేటైజేష‌న్ అయితే త‌మ‌ది నేష‌న‌లైజేష‌న్ అంటూ బీఆర్ఎస్ జాతీయ విధానాన్ని స్ప‌ష్టంగా కేసీఆర్ చెప్పారు. రైతు సంక్షేమమే ల‌క్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్తుంద‌ని కేసీఆర్ చెప్ప‌క‌నే చెప్పారు. దేశంలో అధిక భాగం రైతులు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో రైతు అజెండాను తీసుకోవ‌డం ద్వార బీఆర్ఎస్ వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌జ‌ల్లోకి వెళ్లొచ్చ‌ని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ ల‌క్ష్యాలు ఒక విధంగా బీజేపీకి షాక్ ఇస్తాయ‌ని చెప్పుకోవ‌చ్చు. మోదీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైన విష‌యాల‌నే కేసీఆర్ టార్గెట్ చేసుకున్నారు. ఇది కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాన్ని స్ప‌ష్టం చేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper