Kcr – Kejriwal: కేసీఆర్ ‘ప్రధాని’ ఆశ అడియాశలేనా? ఒకవేళ మోడీ ఓడిపోతే కేజ్రీవాల్ కే ఛాన్స్?

Kcr – Kejriwal: కేంద్రంలో మోడీ ఉండగా.. మరో ప్రధాని పుట్టుకురావడం కష్టం. ఆయన ఓడితేనే కొత్త ప్రధాని వస్తాడు. దేశంలోని విజయవంతమైన సీఎంలైన కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్ లు పోటీకి వస్తారు. ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆ పోస్టు కూడా తెగ లాబీయింగ్ చేస్తున్నారు. పలు రాష్ట్రాల పర్యటనలూ పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే కేసీఆర్ ప్రధాని ఆశ నెరవేరేదే.. కానీ ఇప్పుడు షాక్ తగిలింది. తెలంగాణ […]

Written By: NARESH, Updated On : March 8, 2022 12:39 pm
Follow us on

Kcr – Kejriwal: కేంద్రంలో మోడీ ఉండగా.. మరో ప్రధాని పుట్టుకురావడం కష్టం. ఆయన ఓడితేనే కొత్త ప్రధాని వస్తాడు. దేశంలోని విజయవంతమైన సీఎంలైన కేజ్రీవాల్, మమతా బెనర్జీ, కేసీఆర్ లు పోటీకి వస్తారు. ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆ పోస్టు కూడా తెగ లాబీయింగ్ చేస్తున్నారు. పలు రాష్ట్రాల పర్యటనలూ పెట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే కేసీఆర్ ప్రధాని ఆశ నెరవేరేదే.. కానీ ఇప్పుడు షాక్ తగిలింది.

Kcr – Kejriwal

తెలంగాణ సీఎం కేసీఆర్ ‘ప్రధాని’ ఆశలు యూపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తో అడియాశలైనట్టేనా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇక కేసీఆర్ సైతం జాతీయ రాజకీయాల ఊసు ఎత్తరని 2024 వరకూ మౌనంగా ఉంటారని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది..ఎందుకంటే యూపీలో అంత వ్యతిరేకత మధ్యలోనూ ప్రజలు బీజేపీనే గెలిపించబోతున్నారని ఎగ్జిట్ పోల్స్ తో స్పష్టమైంది.కొద్దిరోజుల ముందు వరకూ యూపీలో బీజేపీపై తీవ్ర విమర్శలు.. వివాదాలు.. రైతులను తొక్కించి చంపారని స్వయంగా ఓ కేంద్రమంత్రి కొడుకు జైలు పాలయ్యాడు. కేంద్రమంత్రిపై కూడా విమర్శలు వచ్చాయి. కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి ప్రభుత్వంపై విమర్శలు చేసినా.. కుల సమీకరణాల్లో ప్రత్యర్థి పార్టీలు అన్నీ ఏకమైనా సరే.. అవేవీ యోగి ఆధిత్యనాథ్ విజయాన్ని ఆపలేకపోతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

Also Read:  జనసేన-తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయా? చేస్తే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

కోవిడ్ కట్టడిలో యోగి ప్రభుత్వంపై విమర్శలు.. బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి వ్యతిరేకత ఉన్నా.. మరోసారి అతిపెద్ద రాష్ట్రం బీజేపీ ఖాతాలో పడబోతోందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తాజాగా కోడై కూశాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో దేశవ్యాప్తంగా ప్రముఖు మీడియా, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. అందరి దృష్టి యూపీపైనే ఉండేది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ లో కమలం పార్టీ గెలుపు ఖాయమని తేలిపోయింది. అయితే సీట్ల పరంగా సమాజ్ వాదీ పార్టీ భారీగా పుంజుకుంటుందని.. బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయని తేలింది. సీఎం కుర్చీ మాత్రం అఖిలేష్ కు అందనంత దూరంగా ఉంది. యోగినే సీఎం కాబోతున్నారు. ఇక బీఎస్పీ కి కనీసం రెండంకెల సీట్లు రావడం కానకష్టంగా మారింది. 50 ఏళ్లకు పైగా రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కు కనీసం 10 సీట్లు రావడం గగనమేనని తేలింది.

Kcr – Kejriwal

 

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న యూపీలో బీజేపీ గెలుపు.. ఢిల్లీలో అధికార పీఠానికి దగ్గరి దారి. ఉత్తరప్రదేశ్ లో గెలిస్తే దేశంలో ఆ పార్టీదే అధికారం అన్న సంగతి అందరికీ తెలుసు. దీంతో కేసీఆర్ ప్రధాని ఆశకు మరో 10 ఏళ్లు పడుతుందా? అన్న సందేహాలు గులాబీ వర్గాలను కలవరపెడుతున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ అన్నింట్లోనూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలలో బీజేపీకే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఈ ఫలితాలతో కేసీఆర్ ఇప్పుడు డైలామాలో పడిపోయారు. థర్డ్ ఫ్రంట్ అంటూ లేదంటే కాంగ్రెస్ తో కలిసి దేశానికి ప్రధాని పదవికి పోటీలో ఉందామని కలలుగన్న కేసీఆర్ కు ఈ ఫలితాలు నిజంగా మింగుడుపడడం లేదు.

పంజాబ్ లో బీజేపీ, కాంగ్రెస్ లను ఓడించి ఆమె ఆద్మీ గెలిచింది. దేశంలో మూడో జాతీయ పార్టీగా ఆప్ రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే గోవా సహా పలు రాష్ట్రాలకు ఆప్ పార్టీ విస్తరించింది. తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్ తో, కేసీఆర్ తో పోల్చితే ఇప్పుడు ప్రధాని రేసులో కేజ్రీవాల్ ముందుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మమతా బెనర్జీ, కేసీఆర్ ల కంటే కూడా ఆప్ అధినేత కేజ్రీవాల్ నిజాయితీపరుడు, సమర్థుడు అన్న పేరు పొందాడు. బీజేపీని ఆయన ఓడించాడు. ప్రత్యామ్మాయంగా జాతీయ స్థాయిలో ఎదుగుతున్నాడు. మమత, కేసీఆర్ లు కేవలం వారి రాష్ట్రాలకే పరిమితం అవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో గెలిచిన చరిత్ర లేదు.

సో మోడీ ఓడిపోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. కేసీఆర్ కల తీరేలా లేదు. ఒకవేళ మోడీ ఓడిపోయినా అందరికంటే ముందు కేజ్రీవాల్ కు పీఎం అయ్యే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మించి మోసం చేసిన కేసీఆర్ కంటే కేజ్రీవాల్ నే నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read: మోడీ వ్యూహాలు రాష్ట్రాల్లో పనిచేయవా?

Tags