Hyderabad: హైదరాబాద్ లో రూ.1200 కోట్లతో తాగునీటి కోసం ప్రణాళిక తయారు చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శివారు ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీంతో నగరవాసుల తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం జరిగిన పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో మాట్లాడారు. పేదవారికి రూ.1 కే నల్లా కనెక్షన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.5378 కోట్లతో ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. భవిష్యత్ లో 24 గంటలు నీరందేలా చర్యలు తీసుకుంటున్నాం.

మున్సిపల్ రంగంలో పలు మార్పులు చేశాం. పౌరుల భాగస్వామ్యం పెంచాం. పట్టణాల్లో 10 శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయించాం. కార్మికులకు సకాలంలో సకాలంలో వేతనాలు అందజేస్తున్నామని చెప్పారు.
స్తానిక సంస్థలను బలోపేతం చేసింది. ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవ వేతనం పెంచింది. స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 25 శాతం కోత విధించింది. నిధుల కోసం గ్రామ పంచాయతీలు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఆదాయ మార్గాలు సూచించింది. సాగునీటి సమస్యను తీర్చాం. అందరికి నీరందించేందుకు చిన్ననీటి వనరులను అభివృద్ధి చేసింది.
ఫ్లోరైడ్ రహిత రాష్ర్టంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది 9 వేల గ్రామాలకు 3 వేల పంచాయతీ కార్యదర్శులను నియమించి విధుల్లో ఆటంకాలు లేకుండా చేస్తోంది. పంచాయతీ కార్యదర్శుల కొరత లేకుండా చేసింది. ఇందులో భాగంగా పరిపాలనలో సమూల మార్పులు తీసుకొచ్చింది. 350 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ర్టంలో 2600 రైతు వేదికలను నిర్మించింది. కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు తీసుకుంది. పల్లెప్రగతితో రూపురేఖలు మారిపోయాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లలో రూ.8,536 కోట్లు వెచ్చించి 18,600 కిలోమీటర్ల రోడ్లు నిర్మించింది. రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తోంది. ప్రజల స్థితిగతులు మార్చేందుకు అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంక్షేమ పథకాలను సైతం తీసుకొచ్చింది.