CM KCR: మెదక్ ప్రస్తుత ఎంపీ, దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి గన్‌మెన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై సోమవారం కత్తితో దాడి జరిగిన విషయం తెలిసింది.సిద్దిపేట సూరంపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రభాకర్‌రెడ్డి ప్రచారం అనంతరం మరోచోటుకు వెళ్లేందుకు కారు వద్దకు వచ్చాడు. ఈ సమయంలో అతడి వద్దకు వచ్చిగ గటాల రాజు అనే యువకుడు కత్తితో దాడిచేశారు. ఈ సమయంలో పక్కనే ఉన్న గన్‌మెన్ అప్రమత్తమై కత్తిని లాక్కున్నాడు. ఈ సమయంలో అతడి చేతికి కూడా గాయమైంది. అనంతరం ప్రభాకర్‌రెడ్డిని మొదట గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు.
మంత్రి హరీశ్ పరామర్శ..
హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొత్త ప్రభాకర్‌రెడ్డిని మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రభాకర్‌రెడ్డి కడుపులో బ్లీడింగ్ అవుతోందని, ఆపరేషన్ చేయాలని చేయాలని చెప్పారు. సుమారు 4 గంటలపాటు సర్జరీ చేశారు. 10 సెంటీమీటర్ల మేర చిన్నపేగు తొలగించినట్లు వైద్యులు తెలిపారు.
సీఎం కేసీఆర్ పరామర్శ..
ఇదిలా ఉండగా, ఆపరేషన్ అనంతరం సీఎం కేసీఆర్ కూడా యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ కేసీఆర్‌ను చూసి కంటతడి పెట్టారు. వెంటనే సీఎం ఆయనకు ధైర్యం చెప్పారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.
గన్‌మెన్‌కు నమస్కారం..
అనంతరం బయటకు వస్తున్న కేసీఆర్‌కు అక్కడే ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి గన్‌మెన్ కనిపించాడు. వెంటనే ఆయనకు నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గన్‌మెన్ అప్రమత్తంగా లేకుంటే పరిస్థితి మరోలా ఉండేదని కేసీఆర్ పేర్కొన్నారు. గన్‌మెన్‌కు కేసీఆర్ నమస్కరిస్తున్న ఫొటోను బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
మరో నాలుగు రోజులు ఆస్పత్రిలోనే..
కాగా, కొత్త ప్రభాకర్‌రెడ్డి మరో నాలుగు రోజులు యశోద ఆస్పత్రి ఐసీయూలోనే ఉండాలని వైద్యులు సూచించారు. కడుపులో బ్లీడింగ్ అయినందున దానిని తొలగించామని, ఇన్‌ఫెక్షన్ కాకుండా ఉండేందుకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా మరో నాలుగు రోజులు ఐసీయూలో ఉండడం మంచిదని తెలిపారు.