ఆ అద్భుత దీపంపైనే కేసీఆర్ ఆశలు.. విజయశాంతి హాట్ కామెంట్స్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు విజయశాంతి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను మరోసారి టార్గెట్‌ చేశారు. ఆయనపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిని ఎద్దేవా చేస్తూ రాములమ్మ పెట్టిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారింది. టైం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌‌పై విరుచుకుపడే రాములమ్మ.. మరోసారి గ్రేటర్‌‌ ఎన్నికల షెడ్యూల్‌ సందర్భంగా తన విమర్శలను మరోసారి సంధించారు. Also Read: మోగిన గ్రేటర్ ఎన్నికల నగారా.. డిసెంబర్ 1 […]

Written By: NARESH, Updated On : November 17, 2020 7:54 pm
Follow us on

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు విజయశాంతి.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను మరోసారి టార్గెట్‌ చేశారు. ఆయనపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో మరో పోస్టు పెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిని ఎద్దేవా చేస్తూ రాములమ్మ పెట్టిన పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారింది. టైం వచ్చినప్పుడల్లా కేసీఆర్‌‌పై విరుచుకుపడే రాములమ్మ.. మరోసారి గ్రేటర్‌‌ ఎన్నికల షెడ్యూల్‌ సందర్భంగా తన విమర్శలను మరోసారి సంధించారు.

Also Read: మోగిన గ్రేటర్ ఎన్నికల నగారా.. డిసెంబర్ 1 పోలింగ్.. పార్టీల బలాలివే

మొన్నటి దుబ్బాక ఉప ఎన్నికలో ఓటమి పాలైనా.. టీఆర్‌‌ఎస్‌ అధినేత కేసీఆర్‌‌ దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఫైర్‌‌ అయ్యారు. ఆ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామంటూ సాధ్యం కాని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఈ ప్రయత్నం అంటూ దుయ్యబట్టారు.

అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుత దీపంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయా అని సెటైర్లు విసిరారు. ఏళ్లపాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా.. విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అందె వేసిన చేయిగా మారిపోయారని సంధించారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ఫార్ముల గురించి కేసీఆర్, ఎంఐఎం అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోందన్నారు.

Also Read: కమలం ‘గ్రేటర్’ ఆపరేషన్..కారు పరేషాన్

ఈసారి గ్రేటర్‌‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌‌కు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు సిద్ధమయ్యారని అన్నారు. ఎంఐఎంతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్నా.. సీఎం దొరగారు వేసిన లెక్కలన్నీ ఈసారి తారుమారు కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఈసారి జీహెచ్ఎంసీ మేయర్‌‌ పదవి ‘మేసేవారికి’ కాకుండా ‘మేయరు…’ అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని ఓ పెద్ద పోస్టు పెట్టారు విజయశాంతి. ఇక రాములమ్మ విమర్శలపై అధికార పార్టీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్