KCR Strategy: తెలంగాణ రాజకీయాల్లో అపర మేథావిగా ఉన్న కేసీఆర్‌కు.. ఇప్పుడు కాస్తంత గడ్డు కాలం నడుస్తోందని చెప్పొచ్చు. ఎప్పుడైతే హుజూరాబాద్‌లో పార్టీ ఓడిపోయిందో అప్పటి నుంచే ఆయన మీద వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోంది. అనేక సంక్షేమ పథకాలను అమల్లో ఉంచినా కూడా ఆయన మీద వ్యతిరేకత ఆగట్లేదు. ప్రాజెక్టులు, ఉచిత కరెంటు, రైతుబంధు లాంటి అనేక కార్యక్రమాలను వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు తీసుకు వచ్చారు. కానీ వరి కొనుగోళ్ల విషయంలో ఇప్పుడు తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది.
అటు రైతుల్లోనూ, ఇటు యువతలోనూ వ్యతిరేకత బాగా పెరుగుతోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉండటంపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఎన్నో దీక్షలు, ధర్నాలు చేస్తున్నాయి. అటు కొన్ని సామాజిక వర్గాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తమకు అన్యాయం చేస్తున్నారంటూ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. వీటన్నింటినీ తన రాజకీయ చతురతతో కవర్ చేయాలని చూస్తున్నా కూడా సాధ్యపడట్లేదు.
అయితే ఎప్పటి నుంచో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలకు ఇంకా కార్యరూపం దాల్చట్లేదు. సంక్రాంతి తర్వాత కచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని, ఆ వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చి విమర్శలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావించారు. ఈ వ్యవహారారాన్ని తెరమీదకు తెస్తే అటు మీడియా, ఇటు ప్రజలు ఇతర అంశాల కంటే దీని మీదనే ఫోకస్ పెడతారని కేసీఆర్ ప్లాన్. కానీ సంక్రాంతి దాటిపోతున్నా కూడా ఇంకా ఈ వ్యవహారాన్ని చక్కదిద్దట్లేదు కేసీఆర్.
Also Read: బీజేపీ కీలక నేత విషయంలో కేసీఆర్ వ్యూహం ఫలించినట్టేనా..?
ఇక తెలంగాణలో ముందస్తు వార్తలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. ఆగస్టు తర్వాత ఎప్పుడైనా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్తారనే ప్రచారం కూడా బాగానే సాగుతోంది. అంటే ఆ లోపు మంత్రి వర్గ విస్తరణ ఉండకపోవచ్చే అంటున్నారు రాజకీయ నిపుణులు. ఈ గ్యాప్‌లో విస్తరణ చేసినా కొత్త మంత్రులకు పెద్దగా సమయం ఉండదు కాబట్టి ఆ విషయాన్ని కేసీఆర్ పక్కన పెట్టారని అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ ముందస్తుకు వెళ్లకపోతే ఈ ఏడాది చివరిలోగా విస్తరణ ఉంటుందని చెబుతున్నారు.
ఇక తన సంక్షేమ పథకాలను మాత్రమే ఈ సారి నమ్ముకోకుండా అన్ని రకాలుగా వ్యూహ రచన చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ టీం సాయాన్ని కూడా తీసుకుంటారని తెలుస్తోంది. ఇలా అన్ని రకాలుగా తనకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుని ఎన్నికలకు వెళ్తారు కేసీఆర్. మరి ఇన్ని రోజులుగా ఎమ్మెల్యేలను ఊరిస్తున్న మంత్రి పదవుల విస్తరణ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
Also Read: కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు రద్దు చేసుకున్నాడు? కారణం అదేనా?